మార్చేస్తా.. మార్చేస్తానంటూ రాజకీయాల్లోకి వచ్చేసి ప్రజారాజ్యం పార్టీని పెట్టేసి.. కొంతకాలానికే దాన్ని కాంగ్రెస్ లో కలిపేసి.. కేంద్రమంత్రి పదవితో సర్దుకున్న వైనం తెలిసిందే. రాష్ట్ర విభజన అంశంలోనూ మొదట సమైక్యం అని చెప్పటం.. ఆ తర్వాత విభజనకు అనుకూలంగా వ్యవహరించటం.. విభజన బిల్లుపై చర్చ సందర్భంగా సమైక్యవాదనను వినిపించిన.. సగటు తెలుగువారి అగ్రహానికి చిరు గురి కావటం తెలిసిందే.
మిగిలిన నేతలకు భిన్నంగా.. రెండు ప్రాంతాల్లోని ఏ వర్గానికి చిరంజీవి దగ్గర కాకపోవటం తెలిసిందే. సార్వత్రిక ఎన్నికల తర్వాత కొంతకాలం కామ్ గా ఉండి..ఈ మధ్య కాలంలో 150 సినిమా అంటూ హడావుడి చేస్తూ.. రాజకీయాల గురించి తక్కువగా.. సినిమాలకు సంబంధించిన వ్యవహారాల్లో తరచూ కనిపిస్తున్న చిరు.. తాజాగా గోదావరి పుష్కరాల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన రాజమండ్రిలోని పుష్కర ఘాట్ లో స్నానం ఆచరించారు. చిరంజీవితో పాటు.. ఆయన బావమరిది.. సినీ నిర్మాత అల్లు అరవింద్ కూడా చిరు పక్కనే ఉన్నారు. వారిద్దరూ పితృకర్మలు చేసి.. పుష్కర స్నానం చేశారు. వీఐపీ ఘాట్ లో స్నానం చేసిన చిరును చూసేందుకు పుష్కర యాత్రికులు పెద్ద ఎత్తున పోటీ పడ్డారు. ఏపీకి పూర్తిగా అన్యాయం చేశారన్న అపప్రదను మూటగట్టుకున్న చిరును చూసేందుకు పెద్దఎత్తున ఏపీ ప్రజలు ఉత్సాహం ప్రదర్శించటం చూసి.. చిరు క్రేజ్ ఇంకా తగ్గలేదే అని వ్యాఖ్యానిస్తే..చూసేందుకు జనాలు ఎగబడటం కామనే.. అదంతా అభిమానమేమీ కాదంటూ విమర్శించారో తెలుగు తమ్ముడు.