వదల బొమ్మాళి.. వొదలా అన్నట్లుగా కొందరు ప్రముఖులకు.. సెలబ్రిటీలకు.. సామాన్యులకు వరుస పెట్టి షాకులు ఇస్తోంది కరోనా మహమ్మారి. ఒకసారి వచ్చామా వెళ్లిపోయామా? అన్నట్లు కాక.. రెండోసారి.. కొందరికి మూడోసారి సైతం కరోనా వస్తున్న సంగతి తెలిసిందే. రెండు రోజుల క్రితం మెగాస్టార్ చిరంజీవి కరోనా బారిన పడటం.. ఆయన ఐసోలేషన్ లోకి వెళ్లిపోవటం తెలిసిందే.
ఇదిలా ఉంటే.. మెగాస్టార్ మరోసారి కరోనా బారిన పడ్డారన్న విషయం తెలిసిన వెంటనే పలువురు ఆయన కోలుకోవాలని ప్రార్థించటం తెలిసిందే. ఇదిలా ఉంటే.. పలువురు ప్రముఖులు సైతం ఫోన్లు చేసి పరామర్శిస్తుంటారు. ఇలాంటి వేళ.. అనూహ్యంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం..చిరుకు స్వయంగా ఫోన్ చేసి.. ఆయన యోగక్షేమాల గురించి అడిగి తెలుసుకున్నారు. అంతేకాదు.. కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన సీఎం కేసీఆర్.. చిరంజీవి కుటుంబ సభ్యులతోనూ మాట్లాడటం గమనార్హం.
తెలంగాణ ప్రభుత్వానికి.. తెలుగు చిత్ర పరిశ్రమకు వారధిలా నిలుస్తూ.. పలు సందర్భాల్లో సీఎం కేసీఆర్ తో భేటీ కావడం తెలిసిందే. వారు డిసైడ్ చేసిన రీతిలోనే పలు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇలాంటివేళ.. చిరు నుంచి పాజిటివ్ బారిన మరోసారి పడినట్లుగా తేలటంతో వెంటనే సీఎం కేసీఆర్ స్పందించి ఫోన్ చేయటం ఆసక్తికరంగా మారింది.
అదే సమయంలో.. కొద్ది రోజుల క్రితమే లంచ్ కు తన నివాసానికి ఆహ్వానించి మరీ.. బ్రహ్మాండమైన అతిథి సత్కారాలు చేసిన ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నుంచి మాత్రం.. ఎలాంటి ఫోన్ రాకపోవటం..యోగక్షేమాలను అడిగి తెలుసుకోవటం లాంటివి చేయకపోవటాన్ని అండర్ లైన్ చేసి మరీ ప్రశ్నిస్తున్నారు. మరి.. సీఎం జగన్ ఈ అంశంపైఎలా రియాక్టు అవుతారో చూడాలి.