చిత్తూరు నగర కార్పొరేషన్ కార్యాలయంలో దారుణం చోటు చేసుకుంది. చిత్తూరు నగర మేయర్ కటారి అనురాధను హత్య చేశారు. ఆమెపైనా.. ఆమె భర్త మోహన్ మీద హత్యాయత్నం జరిగింది. ఈ ఘటనలో అనురాధ ఘటనాస్థలంలోనే మరణించారు. కర్ణాటకకు చెందిన ముగ్గురు దుండగులు వారిపై కత్తితో దాడి చేసి.. తుపాకీతో కాల్పులు జరిపినట్లు చెబుతున్నారు. ఈ ఘటనలో మేయర్ అనురాధ.. ఆమె భర్త మోహన్ కు తీవ్ర గాయాలు అయినట్లు చెబుతున్నారు. తీవ్రగాయాల పాలైన అనురాధ అక్కడికక్కడే మరణించారు.
తెలుగుదేశం పార్టీకి చెందిన మేయర్ పై దాడి చేసి హత్య చేయటం ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ ఘటనపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కటారి అనురాధ కుటుంబానికి.. సీకే బాబు కుటుంబానికి మధ్య రాజకీయ విభేదాలు.. పగలు ఉన్నట్లుగా తెలుస్తోంది. గతంలో వీరి మధ్య పలుమార్లు ఘర్షణలు.. హత్యాయత్నాలు జరిగినట్లుగా చెబుతున్నారు.
తీవ్రంగా గాయపడిన అనురాధ.. ఆమె భర్తను ఆసుపత్రికి తరలించారు. తాజా ఘటనతో చిత్తూరు నగరంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. తాజా దాడి నగరపాలక సంస్థ కార్యాలయంలోనే జరగటం గమనార్హం. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు బయటకు రావాల్సి ఉంది.