తండ్రిపాత్రలో క్రిస్ గేల్ ఒదిగిపోయాడు!

Update: 2016-08-03 09:38 GMT
బ్యాట్ పట్టి గ్రౌండ్ లోకి అడుగుపెట్టాడంటే విధ్వంసం చేస్తాడు.. ఫాస్ట్ బౌలర్లు - స్పిన్ బౌలర్లు అనే తేడాలేమీ చూడకుండా ఊచకోతకోస్తాడు. సంబరాల సమయంలో డాన్స్ చేస్తాడు, మరీ సంబరాలు ఎక్కువైతే షర్ట్ విప్పేస్తాడు. ఇన్ని పరిచయ వాక్యాలు అవసరం లేకుండా.. వెస్టిండీస్ విధ్వంసక ఆటగాడు అన్నా ఇట్టే గుర్తుకు వచ్చే క్రికెటర్ క్రిస్ గేల్! ప్రస్తుతం క్రికెట్ కు సెలవు పెట్టి తన వ్యక్తిగత జీవితానికి సంబందించిన సంబరాల్లో ఉన్నాడు గేల్!

అవును... క్రిస్ గేల్ తండ్రిగా ప్రమోషన్ కొట్టేసిన ఆనందంలో మునిగి తేలుతున్నాడు. అతని భార్య బెర్రిడ్జ్ కొన్ని నెలల కిందట ఓ పండంటి పాప 'బ్లష్' కు జన్మనిచ్చింది. తండ్రిగా మారిపోయిన గేల్ లో ఒక్కసారిగా పెద్ద మార్పే వచ్చినట్లుంది. ఖాళీ సమయం దొరికితే పబ్బుల చుట్టూ తిరుగుతాడనే పేరున్న గేల్ ప్రస్తుతం ఇంటి పట్టునే ఉండి ముద్దులొలికే కూతురికి పాలు పడుతున్నాడు. భారత్ తో జరుగుతున్న టెస్టు సిరీస్ ను కూడా వదులుకుని కూతురుతో కాలక్షేపం చేసేందుకు సమయం వెచ్చిస్తున్నాడట.

తాజాగా తన చిన్నారి బ్లష్ కు పాలపీపా ద్వారా పాలు పట్టిస్తూ దిగిన ఫొటోను తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు గేల్. దీంతో ఈ ఫొటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఇప్పటివరకూ గేల్ విధ్వంసక ఆటతీరును అభినందించే అభిమానులు.. గేల్ గుడ్ ఫాదర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Tags:    

Similar News