రెండు వేల నోట నీవెక్కడ ...? లక్ష రూపాయలైన సరే పర్సులో పెట్టుకుని ఎక్కడికైన సరే హాయిగా వెళ్లిపోవచ్చు .... కాని ఇలా వచ్చి అలా కనిపించకుండా పోయావు ..... నీవు ఎక్కడి వెళ్లావు ....2014లో అధికారంలోకి వచ్చిన భారతీయ జనతా పార్టీ - 2016లో నోట్ల రద్దు కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ నిర్ణయం వలన అటు ప్రతిపక్షాల నుంచి - ప్రజల నుంచి కూడా పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది. పెద్ద నోటు అంటే 1000 నోట్ల వలన నల్లధనం - దేశంలోని కొంత మంది నల్లధనాన్ని పెద్ద నోట్ల రూపంలో సులువుగా దాచుకుంటున్నారని - అందుకే ఈ పెద్ద నోట్లను రద్దు చేసామని భారతీయ జనతా పార్టీ సమర్దించుకుంది. అయితే పెద్ద నోట్ల వల్ల నల్లధనం పెరిగిపోతోందని చెప్పిన భారతీయ జనతా పార్టీ 2000 నోటును విడుదల చేసి ఇంకా సంచలనం స్రుష్టించింది. ప్రస్తుతం 2000 నోటు చాలా అరుదుగా కనిపిస్తోంది. అయితే నల్లధనం పోగుచేయడం 2000 నోటుతో ఇంకా సులభతరమైందని ఆరోపణలు వస్తున్న నేపధ్యంలో ఈ నోటు ముద్రను క్రమేపి తగ్గించేస్తున్నట్లు ఆర్ బిఐ నివేదికల ద్వారా తెలుస్తోంది.
రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా విడుదల చేసిన నివేదిక ప్రకారం 2017 - 18 సంవత్సరంలో 95 శాతానికి 2000 నోట్ల ముద్రణ తగ్గినట్లు తెలుస్తోంది. గత సంవత్సరం 50 శాతం సర్క్యులేషన్ లో ఉన్న ఈ నోటు 37 శాతనికి పడిపోయిందని తెలుస్తోంది. నల్లధనం నిర్మూలనే మా ధ్యేయం అంటూ నోట్ల రద్దును చేపట్టిన భారతీయ జనతా పార్టీ. అది విఫలమడమే కాకుండా - నల్లధనం ఇంకా పెరిగిపోతోందని విపక్షాలు దుమ్మేత్తి పోయడంతో - ఇరుకున పడిన అధిష్టానం - క్రమేపీ ఆ నోట్లను చలామణిలో లేకుండా చేయడం ఒక్కటే మార్గమని ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్లేషకులు అంటున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరణంలో బిజేపి ఎటువంటి సహాసోపేత నిర్ణయాలు తీసుకున్న అది తమ పార్టీకి చేటు చేస్తుందని - ఆచీ - తూచీ వ్యవహరిస్తున్నట్లు సమాచారం అయితే 500 నోట్ల చలామణి మాత్రం రోజురోజూకి గణనీయంగా పెరుగుతోందని ఆర్ బిఐ వర్గాలు చెబుతున్నాయి.