గుడ్ న్యూస్: అందరికీ ఉచిత వైఫై..

Update: 2019-07-31 04:25 GMT
మోడీ వచ్చాక డిజిటల్ ఇండియాకు అడుగులు పడ్డాయి. అందుకు అనుగుణంగానే జియో రంగ ప్రవేశంతో దేశ టెలికాం రంగమే మారిపోయింది. జియో రాకముందు 1జీబీ డేటా 300కు పైగా ఉండేది. కేవలం నెలకు 1 జీబీ మాత్రమే వ్యాలిడిటీ ఉండేది. కానీ ఇప్పుడు జియో రోజుకే 1.5 జీబీ చొప్పున ప్యాకేజీలతో అన్ లిమిటెడ్ డేటా అందిస్తోంది. దీంతో అందరూ ఇంటర్నెట్ మాయలో పడిపోయారు.ఆన్ లైన్ లో తెగ యాక్టివ్ అయ్యారు..

వినియోగదారులకు నిత్యావసరంగా మారిన ఇంటర్నెట్ ను అందరికీ అందించాలని ఇప్పటికే ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉపకరణాల సంస్థ సిస్కో నడుం బిగించింది.   సిస్కో నెట్ వర్క్ మౌలిక వసతుల సంస్థ ఐటీ సిటీ బెంగళూరులోని 25 ప్రాంతాల్లో ఉచిత హైస్పీడ్ వైఫై సదుపాయాన్ని ఏర్పాటు చేసింది.

తాజాగా సిస్కో ఈ ఉచిత హైస్పీడ్ ను దేశవ్యాప్తంగా విస్తరించేందుకు టెక్నాలజీ దిగ్గజం గూగుల్ తో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది. రాబోయే రెండు - మూడేళ్ల కాలంలో వివిధ నగరాల్లో 200 ప్రాంతాలకు విస్తరించనున్నట్టు సిస్కో ప్రకటించింది.

దేశంలో ప్రస్తుతం వివిధ సంస్థల నిర్వహణలో 52వేల ఉచిత వైఫై హాట్ స్పాట్ జోన్లు ఉన్నాయి. ఇప్పుడు సిస్కో, గూగుల్ కూడా అంతర్జాతీయ భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి.. ఈ కోవలోనే భారత్ లో తొలి సారిగా ఈ ఉచిత వైఫై ను అందించేందుకు రెండు సంస్థలు నిర్ణయించాయి.
Tags:    

Similar News