జూ.ఎన్టీఆర్ సినిమాలు విడుదలైతే చంద్రబాబు, లోకేష్ ఎప్పుడైనా స్పందించారా?: పేర్నినాని
భీమ్లానాయక్ సినిమాను కూడా చంద్రబాబు రాజకీయం కోసం వాడుకుంటున్నారని ఏపీ మంత్రి పేర్ని నాని నిప్పులు చెరిగారు. ఏపీ రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పేర్ని నాని శుక్రవారం సాయంత్రం అమరావతిలో మీడియాతో మాట్లాడారు. భీమ్లానాయక్ సినిమాపై చంద్రబాబు సహా విపక్షాలు చేసిన విమర్శలకు మంత్రి పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు.
టీడీపీ, బీజేపీ, జనసేన బ్లాక్ టికెట్ అమ్మకాలను ప్రోత్సహిస్తున్నాయని ఆయన మండిపడ్డారు. సినిమా టికెట్ల విషయంలో హైకోర్టు తీర్పు ఉన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అంతేకాదు ప్రభుత్వమంటే విపక్షాలకు లెక్కలేదన్నారు.
నీతులు చెప్పే ఓ హీరో నీతిమాలిన పనులు చేస్తున్నారని మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. బ్లాక్ లో టికెట్లు అమ్మితే ప్రభుత్వం పట్టించుకోవద్దా? అని పేర్ని నాని ప్రశ్నించారు. ఓ సినిమా కోసం తండ్రీ కొడుకులు పిల్లిమొగ్గలు వేస్తున్నారని చంద్రబాబుపై పేర్ని నాని సెటైర్లు వేశారు.
బీమ్లానాయక్ సినిమాను తొక్కడం ఏమిటని మంత్రి ప్రశ్నించారు. ప్రభుత్వ చట్టాలు సినిమాలకు వర్తించవా? అని మంత్రి అడిగారు. జీవో 37 ప్రకారం సినిమా టికెట్ చార్జీలు ఉండాల్సిందేనని మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు.
టాలీవుడ్ సినిమా పెద్దలు వచ్చారని.. జీవో ఇస్తామన్నారని.. ఇప్పుడు జీవో ఎందుకు ఇవ్వలేదని ఆరోపిస్తున్నారని పేర్ని నాని ఆరోపించారు. ఈనెల 24న సినిమా టికెట్ల జీవో రావాల్సింది కానీ.. మంత్రి గౌతం రెడ్డి మృతితో జీవో జారీకి ఆలస్యమైందని మంత్రి పేర్ని నాని వివరించారు. భీమ్లా నాయక్ సినిమా తాను ఎప్పుడెప్పుడా చూడాలని లోకేష్ ప్రకటించడాన్ని మంత్రి పేర్ని నాని ప్రస్తావించారు.
జూనియర్ ఎన్టీఆర్ సినిమా విడుదలైన సమయంలో ఏనాడైనా కూడా చంద్రబాబు, లోకేష్ లు మాట్లాడారా అని మంత్రి ప్రశ్నించారు. టీడీపీ జెండాను జూ.ఎన్టీఆర్ మోస్తున్నాడు కదా ? ఎందుకు మాట్లాడరని పేర్ని నాని ప్రశ్నించారు.
పవన్ కళ్యాణ్ సినిమాను తొక్కేస్తున్నారని చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదం అని పేర్ని నాని అన్నారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వాన్ని నడిపాడా? ఇంకా ఏమైనా నడిపాడా అని ఆయన అడిగారు. తన సినిమాను ఫ్రీగా చూపిస్తామని పవన్ కళ్యాణ్ ప్రకటించిన విషయాన్ని పేర్ని నాని గుర్తు చేసి సెటైర్ వేశారు. సినిమా బాగుంటే జనం వేలం వెర్రిగా చూస్తారన్నారు. పుష్ప సినిమాను జనం ఇలాగే చూశారని ఈ సందర్భంగా ప్రస్తావించారు.
https://twitter.com/tollywoodtaliva/status/1497165565684711426?s=20&t=U06QtQ5ZDCRPMd8wsRBD2Q
ఉదయం భీమ్లానాయక్ సినిమా టికెట్ ధరల విషయమై ఏపీ ప్రభుత్వం తీరును టీడీపీ చీఫ్ చంద్రబాబు కూడా తప్పుపట్టారు. ఈ మేరకు భీమ్లానాయక్ ను జగన్ సర్కార్ టార్గెట్ చేసి వేధిస్తోందని దుయ్యబట్టారు. దీనికి కౌంటర్ గానే మంత్రి పేర్ని నాని విమర్శలు గుప్పించారు.
https://twitter.com/2024YSRCP/status/1497166188756963328?s=20&t=HPPFnKo4VgThC0OymU9z1g