ఇద్దరూ అధికారపార్టీకి చెందిన కౌన్సిలర్లు. అలాంటి ఇద్దరి నేతల మధ్య మాట తేడా వచ్చింది. ఒకే పార్టీకి చెందిన వారు కూర్చొని మాట్లాడుకుంటే సరిపోయే దానికి ఆవేశంతో మాటా మాటా అనుకున్నారు. హద్దులు దాటిన మాటలతో చేతల వరకూ వ్యవహారం రావటమే కాదు.. అధికారపార్టీ పరువు బజారున పడిన దుస్థితి ఏపీలోని తెనాలిలో చోటు చేసుకుంది.
తెనాలి పురపాలక సంఘ కార్యాలయంలో కౌన్సిలర్ల ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమాశంలో మున్సిపల్ ప్యానెల్ సభ్యుల్ని నియమించే అంశంపై చర్చ వచ్చింది. అది కాస్త తెలుగు తమ్ముళ్ల మధ్య మాట తేడాకు కారణమైంది. అంతే.. తెలుగుదేశం పార్టీకి చెందిన కౌన్సిలర్లు గుమ్మడి రమేశ్(మూడో వార్డు).. త్రిమూర్తులు (12వ వార్డు) మాట.. మాటా అనుకున్నారు.అంతటితో ఆగకుండా విసురుగు ఒకరిపై ఒకరు వచ్చారు.
అంతే.. అప్పటి దాకా నువ్వెంత? అంటే నువ్వెంత? అన్నట్లు పోట్లాడుకున్న వారు కాస్తా.. కలబడి కొట్టేసుకున్నారు. సినిమా ఫైటింగ్ను తలపించేలా సాగిన ఈ గొడవతో మిగిలిన కౌన్సిలర్లు అవాక్కయ్యారు. అక్కడితో ఆగకుండా విపరీతంగా కొట్టేసుకుంటున్న వారిని విడదీసేందుకు మిగిలిన నేతలు కష్టపడాల్సి వచ్చింది. వీరి ఫైటింగ్ కెమేరా కంటికి చిక్కటంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ విజువల్స్ సంచలనం సృష్టిస్తున్నాయి.