తెలంగాణ రాష్ట్రంలో మున్సిపాలిటీలు.. కార్పొరేషన్లకు జరిగిన ఎన్నికల ఫలితాలు వెలువడటం.. కొన్నిచోట్ల హంగ్ ఏర్పడితే.. మరికొన్నిచోట్ల కాంగ్రెస్.. బీజేపీలు అధిక్యతను ప్రదర్శించాయి. అయితే.. అలాంటివి చాలా తక్కువే. అలాంటిచోట్ల కూడా తమ సత్తా చాటాలని.. తమ అధిక్యతను ప్రదర్శించాలని అధికార టీఆర్ఎస్ చేస్తున్న ప్రయత్నం ఇప్పుడు కొత్త రచ్చకు తెర తీస్తుంది. నల్గొండ జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రం దీనికో చక్కటి ఉదాహరణగా చెప్పొచ్చు.
ఇక్కడ మున్సిపాలిటీ ఛైర్మన్ ఎంపిక తీవ్ర గందరగోళానికి దారి తీయటమేకాదు.. కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి.. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిలు కొట్టేసుకోవటం సంచలనంగా మారింది. ఒక ఎమ్మెల్యే.. మాజీ ఎమ్మెల్యేలు రోడ్డు మీద కొట్టుకోవటంతో ఇరు పార్టీలకు చెందిన క్యాడర్ అవాక్కు అయ్యారు. ఛైర్మన్ ఎన్నిక విషయంలో చోటు చేసుకున్న పరిణామాలే దీనికి కారణంగా చెప్పాలి.
చౌటుప్పల్ లో కాంగ్రెస్.. సీపీఎం పార్టీలు కలిసి పోటీ చేశాయి. సీపీఎం పార్టీ కౌన్సిలర్లకు అధికార టీఆర్ఎస్ తాయిలాల వల విసరటంతో వారు అటు వైపు వెళ్లే పరిస్థితి నెలకొంది. ఇది తెలుసుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అక్కడకు చేరుకున్నారు. మున్సిపల్ ఛైర్ పర్సన్ ఎన్నికలో పాల్గొనేందుకు వెళుతున్న సీపీఎం కౌన్సిలర్లను అడ్డుకున్నారు.
ఈ క్రమంలో ఎమ్మెల్యే.. మాజీ ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం తీవ్ర రూపం దాల్చటమే కాదు.. ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకోవటంలో అక్కడ ఉద్రిక్తత తీవ్రస్థాయికి చేరుకుంది. పోలీసులు ఎంట్రీ ఇచ్చి ఎమ్మెల్యేను బయటకు తీసుకొచ్చారు. దీంతో.. అక్కడి వాతావరణం తీవ్ర ఉద్రిక్తంగా మారింది.