ఆడవాళ్ల నీటి గొడవ.. రెండు ఊళ్లనే దహించింది!

Update: 2020-05-24 08:39 GMT
ఎక్కడ గొడవైనా కానీ సర్దుకుంటుంది.. కానీ నల్లా నీటి కాడ ఆడవారి మధ్య మొదలైన బిందెల ఫైట్ మాత్రం ఎప్పటికీ ఆగదు.. రగులుతూనే ఉంటుంది. మాటలతో మొదలై జుట్లు పట్టుకొని కొట్టుకునే వరకు.. అనంతరం కుటుంబాలు.. గ్రామాల వరకు పాకింది. అధికార వైసీపీ వర్గాలకు చెందిన  రెండు గ్రామాల వారు ఘర్షణకు దిగి కొట్టుకున్న ఘటన చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది.

చిత్తూరు జిల్లా కేవీపల్లె మండలం నక్కలదిన్నె వడ్డేపల్లి- నూతన కాల్వ గ్రామాల వైసీపీ నేతల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఇద్దరు ఆడవాళ్ల మధ్య తాగునీటి కోసం మొదలైన ఈ ఫైట్ రెండు గ్రామాలు కొట్టుకునేలా చేసింది. రాళ్లు  - కర్రలు - బీరు సీసాలతో దాడులు చేసుకునే వరకు సాగింది. అర్ధరాత్రి నుంచి తెల్లవారే దాకా రెండు గ్రామాలు కొట్టుకొని బీభత్సం సృష్టించారు.

రెండు గ్రామాల ప్రజలు కొట్టుకున్న ఈ దాడుల్లో భారీ ఆస్తినష్టం వాటిల్లింది. ద్విచక్రవాహనాలు, కార్లు ధ్వంసం కాగా.. కొన్నింటికి నిప్పటించారు. మహిళలు, చిన్న పిల్లలు భయభ్రాంతులకు గురయ్యారు. పోలీసులు మోహరించి చెదరగొట్టి పికెటింగ్ ఏర్పాటు చేశారు.

తాగునీటి విషయంలో మహిళల  మధ్య చెలరేగిన చిన్న వివాదం చివరకు రెండు గ్రామాల మధ్య ఘర్షణకు దారితీయడం గమనార్హం.
Tags:    

Similar News