2024 వరకు కేసీఆర్ అప్పు 6లక్షల కోట్లు

Update: 2019-09-30 05:39 GMT
2024 నాటికి కేసీఆర్ తెలంగాణ అప్పును 6 లక్షల కోట్లకు చేరుస్తాడని.. ఇదే ఆయన ఘనత కానుందని కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత మల్లు భట్టి విక్రమార్క జోస్యం చెప్పారు. తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చారని ఆయన ఆరోపించారు. వరంగల్ రూరల్ జిల్లా మొరిపిరాలలో మాట్లాడిన  ఆయన ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అభివృద్ధి కోసమే అప్పులు చేస్తున్నామని చెబుతున్న టీఆర్ఎస్ ప్రభుత్వం.. మరి ఎందుకు హైదరాబాద్ లోని ఖరీదైన భూములను అమ్మకానికి పెడుతోందని మల్లు భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు.  దీనిపై తెలంగాణ సమాజం జాగ్రత్త పడాలని హెచ్చరించారు.

తెలంగాణలో ప్రతిపక్షం లేకుండా కేసీఆర్ కుట్ర పన్నుతున్నారని..  టీఆర్ ఎస్ ప్రభుత్వ విధానాలను ప్రశ్నించకుండా ఉండేందుకు  కేసీఆర్ ఇలా కుట్ర పన్నుతున్నారని భట్టి ఆరోపించారు.

ఇక భట్టితోపాటు పాల్గొన్న టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ కూడా టీఆర్ఎస్ పై మండిపడ్డారు. హుజూర్ నగర్ లో కాంగ్రెస్ గెలుపు ఖాయమని.. టీఆర్ఎస్ గెలిస్తే కేసీఆర్ కు మరింత అహంకారం పెరుగుతుందని పొన్నం మండిపడ్డారు. హుజూర్ నగర్ లో గెలిపిస్తానన్న మంత్రి జగదీశ్ రెడ్డి నప్పతట్లోడు అని ఎద్దేవా చేశారు.
Tags:    

Similar News