కొద్ది రోజుల క్రితం మందసౌర్‌లో జరిగిన పోలీసు కాల్పుల్లో చనిపోయిన రైతుల కుటుంబాలను మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ పరామర్శించారు. మృతుల కుటుంబాలకు రూ. కోటి చొప్పున పరిహారాన్ని ఆయన బుధవారం అందజేశారు. ఆరు కుటుంబాల వారికి సీఎం స్వయంగా చెక్కులు అందించారు.
ముఖ్యమంత్రి సహాయ నిధుల కింద మంగళవారమే నిధులను రాష్ట్రప్రభుత్వం మంజూరు చేసింది. పంటలకు మద్దతు ధరల పెంపు, రైతు రుణాలు మాఫీ వంటి డిమాండ్ల కోసం మందసౌర్ రైతులు ఈ నెల 6న చేపట్టిన ఉద్యమం హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే.
ఆందోళన చేస్తున్న రైతులపై పోలీసులు కాల్పులు జరపడంతో ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో మధ్యప్రదేశ్‌లో ఉద్రిక్తపరిస్థితులు ఏర్పడ్డాయి. రైతులను బుజ్జగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మృతుల కుటుంబాలకు భారీ పరిహారం ప్రకటించింది.
కాల్పులు జరిపినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. మరోవైపు ఇప్పటికీ మధ్యప్రదేశ్ లో రైతుల ఆందోళన చల్లారలేదు. గత 24 గంటల్లో ముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకోగా... కేవలం ఈ వారంల్లోపే ఆత్మహత్య చేసుకున్నవారి సంఖ్య ఐదుకు చేరింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/