అసోం బీజేపీ ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో ప్రాంతీయ అసమానతలు పోవాలంటే దేశానికి అయిదు రాజధానులు ఉండాలని ప్రతిపాదించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌తో ట్విట్టర్‌లో కొనసాగుతున్న వాగ్బాణాల్లో భాగంగా హిమంత బిశ్వశర్మ ఈ ప్రతిపాదన చేయడం విశేషం.
ఇతర రాష్ట్రాలను ఢిల్లీలో పోల్చి అవహేళన చేయడం ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు పరిపాటిగా మారిందని హిమంత బిశ్వశర్మ మండిపడ్డారు. ఇలాంటి విమర్శల్ని పక్కనపెట్టి ప్రతి జోన్‌లో ఒకటి చొప్పున దేశం అయిదు రాజధానుల్ని ఏర్పాటు చేయడంపై అందరం పనిచేయాలని ఆయన కోరారు. అప్పుడు ఢిల్లీలాంటి ఒకే చోట మొత్తం సంపద పోగుపడడం వంటివి చోటు చేసుకోవడం ఉండదన్నారు.
బీజేపీ అధికారంలో ఉన్న అసోంలో సున్నా ఫలితాలు సాధించిన పాఠశాలల మూసివేత నిర్ణయాన్ని విమర్శిస్తూ అరవింద్ కేజ్రీవాల్ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ట్విట్టర్ వార్‌కు దిగిన అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ.. కేజ్రీవాల్‌పై విరుచుకుపడ్డారు.
ఏడు దశాబ్దాల పాటు నిర్లక్ష్యం, తిరస్కరణలకు గురైన ఈశాన్య భారతదేశాన్ని 2014 తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ వచ్చాక ఆదుకున్నారని గుర్తు చేశారు. జాతీయ జీవన స్రవంతిలో కలిపేందుకు ప్రధాని మోదీ చర్యలు తీసుకున్నారని బిశ్వశర్మ కొనియాడారు. ఈశాన్య భారతదేశానికి కేజ్రీవాల్ లాంటి వారి ఎవరి సానుభూతి అవసరం లేదని తేల్చిచెప్పారు.
దేశ రాజధాని ఢిల్లీ నగరాన్ని లండన్, పారిస్ నగరాల మాదిరిగా అభివృద్ధి చేస్తామని కేజ్రీవాల్ అధికారంలోకి వచ్చారని అసోం సీఎం హిమంత బిశ్వశర్మ గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చాక కేజ్రీవాల్ ఆ విషయాన్ని మరిచిపోయారని ఎద్దేవా చేశారు.
కాగా అయిదు రాజధానుల సంగతి ఏమో కానీ దేశానికి రెండో రాజధాని ఉండాలని.. దక్షిణ భారతదేశంలో దాన్ని ఏర్పాటు చేయాలని గతం నుంచి డిమాండ్లు ఉన్నాయి. దేశ రాజ్యాంగ నిర్మాతలు కూడా ముఖ్యంగా బీఆర్ అంబేడ్కర్ కూడా ఈ దిశగా సూచించారని చెబుతున్నారు. హైదరాబాద్‌లో దేశ రెండో రాజధానిని ఏర్పాటు చేయాలనే డిమాండ్లు ఉన్నాయి. అయితే రెండో రాజధాని ఏర్పాటుకే ముందుకు రాని కేంద్ర ప్రభుత్వం తమ పార్టీ ముఖ్యమంత్రి కోరినట్టు అయిదు రాజధానుల ఏర్పాటుకు ముందుకొస్తుందని అనుకోవడం అత్యాశే అవుతుందని అంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.