బ్రేకింగ్: సీజేఐ ఎన్వీ రమణతో సీఎం జగన్ దంపతుల భేటి

Update: 2021-12-25 11:37 GMT
ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొందరు న్యాయమూర్తులు, ఓ సుప్రీం కోర్టు జడ్జి పనిచేస్తున్నారని అప్పట్లో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు లేఖ రాసి పెను సంచలనం సృష్టించారు ఏపీ సీఎం జగన్. కట్ చేస్తే.. ఇప్పుడే అదే జగన్ ప్రస్తుత సీజేఐ రమణను మర్యాదపూర్వకంగా కలవడం హాట్ టాపిక్ గా మారింది. జగన్ తన సతీమణితో పాటు వెళ్లి కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఏపీ సీఎం జగన్ దంపతులు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణను మర్యాదపూర్వకంగా కలిశారు. విజయవాడలోని నోవాటెల్ లో ఉన్న రమణను సీఎం జగన్, భారతిలు వెళ్లి కలిశారు.

గత మూడు రోజులుగా కడప జిల్లాలో సీఎం జగన్ పర్యటిస్తున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలు, శంకుస్థాపనలు, పలు పథకాల అమలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 2021, డిసెంబర్ 25వ తేదీ శనివారం మధ్యాహ్నంతో పర్యటన ముగిసింది. అనంతరం విజయవాడకు చేరుకొని సీజేఐ రమణను కలుసుకున్నారు.

2021, డిసెంబర్ 26న ఏపీ రాష్ట్ర స్థాయి న్యాయాధికారుల రెండో సదస్సుకు సీజేఐ రమణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అదేరోజున ఏపీ హైకోర్టుకు వచ్చారు. హైకోర్టు న్యాయవాదుల సంఘం, బార్ కౌన్సిల్ ఆధ్వర్యంలో సన్మానంలో పాల్గొన్నారు.

డిసెంబర్ 24వ తేదీ శుక్రవారం కృష్ణా జిల్లాలోని స్వగ్రామం పొన్నవరం వెళ్లారు. సీజేఐగా బాధ్యతలు చేపట్టాక మొదటిసారి ఆయన సొంతూరు వచ్చారు. ఈ సందర్భంగా రమణకు గ్రామస్థులు ఘనంగా స్వాగతం పలికారు. 25వ తేదీన పలు కార్యక్రమాల్లో సీజేఐ రమణ పాల్గొననున్నారు.

ఏపీకి దేశానికే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రావడం.. గతంలో విభేదాలు ఉన్నా సరే అవన్నీ పక్కనపెట్టి ఏపీ సీఎం జగన్ కలవడంతో వీరి భేటికి ప్రాధాన్యత సంతరించుకుంది.



Tags:    

Similar News