అవును.. మీరు చదివింది నిజమే. ఏపీలో శాంతి భద్రతలు అంతకంతకూ క్షీణిస్తున్నాయని.. లా అండ్ ఆర్డర్ అదుపు తప్పుతోందన్న మాట విపక్షాల నోట తరచూ వస్తున్న వేళ.. సీఎం జగన్ సొంత జిల్లా కడపలో ఆయన కుటుంబానికి బంధువైన వైఎస్ కొండారెడ్డిని కడప జిల్లా పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించిన వైనం ఇప్పుడు సంచలనంగా మారింది. కడపజిల్లా పులివెందుల నియోజకవర్గ పరిధిలోని చక్రాయపేట మండల వైసీపీ ఇన్ చార్జిగా ఉన్నఆయన్ను అరెస్టు చేయటం సంచలనంగా మారింది.
అయితే.. ఈ ఇష్యూలో సీఎం జగన్ స్వయంగా పోలీసులకు చెప్పి.. అదుపులోకి తీసుకోవాలన్న ఆదేశాలతోనే ఇదంతా జరిగినట్లు చెబుతున్నారు. అసలు ఏం జరిగింది? తమ బంధువుపై పోలీసులు చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ఎందుకు చెప్పారు? లాంటి ప్రశ్నలకు సమాధానాలు వెతికితే తెర వెనుక బోలెడంత జరిగిన తర్వాతే.. బయటకు కనిపించిన సన్నివేశం చోటు చేసుకున్నట్లుగా చెబుతున్నారు.
వైఎస్ కుటుంబానికి బంధువు..జగన్ పాదయాత్ర చేస్తున్నప్పుడు కొంతకాలం ఆయన వెంట నడిచిన కొండారెడ్డి స్థానికంగా దందాలు చేస్తుంటారని చెబుతున్నారు. తమ ప్రాంతంలో ఏ పనులు జరిగినా సరే ఆయనకు కప్పం చెల్లించాల్సిందేనన్న మాట వినిపిస్తూ ఉంటుంది. ఇటీవల పులివెందుల - రాయచోటి రహదారి పనులు జరుగుతున్నాయి. దీని కాంటాక్టును కర్ణాటకకుచెందిన ఎస్ ఆర్కే కన్ స్ట్రక్షన్స్ సంస్థ పనులు చేస్తోంది.
ఈ సంస్థ కర్ణాటక బీజేపీకి చెందిన ఒక ప్రముఖ నేతకు సంబంధించిన సంస్థగా చెబుతుంటారు. అయితే.. రోడ్డు పనులు చేస్తున్న వేళ.. చక్రాయపేటలో పనులు ఇవ్వాలంటే డబ్బులు ఇవ్వాల్సిందేనని వైఎస్ కొండారెడ్డి సదరు కాంట్ట్రాక్టర్ ను బెదిరించాడు. దీంతో.. ఈ విషయాన్ని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వద్దకు తీసుకెళ్లారు. ఆయనతో నేరుగా విషయాన్ని చెప్పటం.. ఆ వెంటనే ఆగ్రహానికి గురైన సీఎం.. తగిన చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు.
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వైఎస్ కొండారెడ్డిని అదుపులోకి తీసుకొని ఆయన మొబైల్ ను చెక్ చేశారు. కాల్ డేటాను చూసినప్పుడు అందులో కాంట్రాక్టర్ ను బ్లాక్ మొయిల్ చేసినట్లుగా నిర్దారించారు. దీంతో ఆయన్ను స్థానిక కోర్టు ఎదుట హాజరుపరిచి.. రిమాండ్ కు తరలించారు. ఏపీ రాజకీయ వర్గాల్లో ఈ ఉదంతం సంచలనంగా మారింది. తాను ప్రాతినిధ్యం వహించే సొంత నియోజకవర్గం (పులివెందుల)లో సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
తమ కుటుంబానికి బంధువైన వ్యక్తిని సీఎం జగన్ స్వయంగా అరెస్టు చేయటం ద్వారా.. దందాలు శ్రుతిమించితే ఊరుకోమన్న సంకేతాన్ని ఇచ్చినట్లు చెబుతున్నారు. అదే సమయంలో.. ఇంతకాలం విపక్షాలు ఏ వాదనను అయితే వినిపించారో అది నిజమన్న విషయం సీఎం జగన్ నిర్ణయంతో తేలిందన్న మాట వినిపిస్తోంది.