త్వ‌ర‌లోనే అసెంబ్లీ.. జ‌గ‌న్ వ‌ర్సెస్ బాబు.. అంద‌రిలోనూ ఇదే చ‌ర్చ‌...!

Update: 2021-09-19 13:30 GMT
రాష్ట్ర అసెంబ్లీ వ‌ర్షాకాల స‌మావేశాలు.. త్వ‌ర‌లోనే జ‌ర‌గ‌నున్నాయి. దీనికి సంబంధించి ప్ర‌భుత్వం కూడా ఏర్పాట్ల‌కు రెడీ అయింది. ఇక‌, మిగిలింది నోటిఫికేష‌నే. అయితే.. ఈ స‌భ‌ల్లో అధికార ప‌క్షం.. వైసీపీ, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ ఏ విధంగా వ్య‌వ‌హ‌రించనున్నాయి?  ముఖ్యంగా సీఎం జ‌గ‌న్‌.. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నాయ‌కు డు, మాజీ సీఎం చంద్ర‌బాబు ఎలా వ్య‌వ‌హ‌రిస్తారు? అనే అంశాల‌పై రాజ‌కీయ వ‌ర్గాల్లో ర‌స‌వ‌త్త‌ర చ‌ర్చ సాగుతోంది. నిజానికి ఏ రాష్ట్ర అసెంబ్లీ స‌భ‌లు జ‌రిగినా.. లేని ఆస‌క్తి.. ఏపీ అసెంబ్లీపై ఉంటుంది. ఈ స‌భ‌ల్లో చ‌ర్చ‌ల‌కు బ‌దులు వ్య‌క్తిగ‌త దూష‌ణ‌ల‌తోపాటు.. సుదీర్ఘ రాజ‌కీయ అనుభ‌వం ఉన్న చంద్ర‌బాబును ఒంట‌రిని చేస్తున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది.

దీంతో అసెంబ్లీ స‌మావేశాల లైవ్‌ల‌కు వీవ‌ర్ షిప్ భారీ ఎత్తున పెరుగుతోంది. ఫ‌క్తు మాస్ మూవీని మించి ప్ర‌జ‌లు ఈ స‌భ‌ల నిర్వ‌హ‌ణ‌ను వీక్షిస్తున్నార‌ని.. ఇటీవ‌ల కొంద‌రు వ్యాఖ్యానించారు కూడా. ఇక‌, ఏటి కేడు.. స‌భ‌ల్లో అంద‌రూ జాగ్ర‌త్త‌లు పాటించాల‌ని.. ఒక‌రిపై ఒక‌రు విమ‌ర్శ‌లు చేసుకోవ‌ద్ద‌ని సంక‌ల్పం చెప్పుకొం టున్నా.. ప‌రిస్థితి మాత్రం చేజారి పోతోంది. పోక చెక్క‌తో నువ్వొక‌టంటే.. త‌లుపు చెక్క‌తో నే రెండంటా.. అనే రేంజ్‌లో నాయ‌కులు రెచ్చిపోతున్నారు. ఈ నేప‌థ్యంలో తాజా స‌భ‌లు మ‌రింత అట్టుడుక‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ప‌రిష‌త్ ఎన్నిక‌ల ఫ‌లితాల‌ను చూపుతూ. వైసీపీ మ‌రింత‌గా టీడీపీని ఏకేస్తుంద‌ని అంటున్నారు.

ఇక‌, టీడీపీ కూడా ఇటీవ‌ల జ‌రిగిన ప‌రిణామాలు.. ముఖ్యంగా చంద్ర‌బాబు ఇంటిపై దాడిని ప్ర‌ధాన అస్త్రం గా చేసుకుంటుంద‌ని.. అంటున్నారు. అదేస‌మ‌యంలో రాష్ట్ర ప్ర‌భుత్వం చేస్తున్న అప్పులు.. ఆర్థిక అరా చ‌కం.. కేంద్రం నుంచి వ‌స్తున్న విమ‌ర్శ‌లు.. వంటివి కూడా.. అసెంబ్లీని వేడెక్కించ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. మ‌రీ ముఖ్యంగా లోకేష్ ఇటీవ‌ల కాలంలో చేసిన వ్యాఖ్య‌ల‌ను వైసీపీ నేత‌లు ప్ర‌స్తావించ‌డంతోపాటు.. లోకేష్ ప‌ర్య‌ట‌న‌ల‌కు వైసీపీ అనుమ‌తి నిరాక‌రించ‌డం.. కేసులు న‌మోదు చేయ‌డాన్ని చంద్ర‌బాబు ప్ర‌ధానంగా చ‌ర్చ‌కు పెట్టే ఛాన్స్ ఉంద‌ని అంటున్నారు. ఇలా ఎలా చూసుకున్నా.. వైసీపీ వ‌ర్సెస్ టీడీపీ ఈ ద‌ఫా కూడా స‌భ‌లు ర‌ణ‌రంగాన్ని త‌ల‌పిస్తాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.
Tags:    

Similar News