తెలంగాణ ముఖ్యమంత్రి - టీఆర్ ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ తన సన్నిహిత వ్యాపారవేత్త ఇంట్లో వివాహానికి హాజరయ్యారు. ప్రముఖ పారిశ్రామిక వేత్త - మై హోం గ్రూప్ చైర్మన్ - టీవీ9 గ్రూప్ ఛానళ్ల అధినేత జూపల్లి రామేశ్వర్ రావు ఇంట వివాహానికి కేసీఆర్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. హైదరాబాద్ లోని నోవాటెల్ హోటల్లో జూపల్లి రామేశ్వరరావు సోదరుడు జగపతి రావు కూతురు లక్ష్మి-రుపూల్ రావు వివాహ వేడుకలకు ఆయన విచ్చేశారు.
జస్టిస్ పొనుగంటి నవీన్ రావుతో జూపల్లి కుటుంబం వియ్యమందుతోంది. శ్రీశ్రీశ్రీ త్రిదిండి శ్రీమన్నారాయణ రామానుజ చిన జీయర్ స్వామి ఆశీస్సులతో నిర్వహిస్తున్న ఈ వివాహానికి తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు హాజరయ్యారు. ఈ వివాహ వేడుకకు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ప్రముఖులు - సినీ నటులు హాజరయ్యారు. మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు సైతం ఈ వివాహానికి విచ్చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన మంత్రులు - ఎమ్మెల్యేలు - ముఖ్యనేతలు సైతం హాజరయ్యారు.