ఢిల్లీ పర్యటనలో సీఎం కేసీఆర్ బిజీబిజీగా ఉన్నారు. ఆరో రోజు హస్తినలో ముఖ్యమంత్రి టూర్ కొనసాగుతుంది. నిన్న ఇద్దరు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. రెండు రోజుల క్రితం ప్రధానితో సమావేశం అయిన సీఎం కేసిఆర్ అనంతరం కేంద్రహోమంత్రితో పాటు పలువురు మంత్రులను కలిసి రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న సమస్యలపై చర్చిస్తున్నారు. కేంద్ర జల శక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ తో సమావేశమైన ఆయన, కొత్త కృష్ణా ట్రైబ్యునల్ ఏర్పాటు చేయాలని, సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ ను వెనక్కి తీసుకుంటామని చెప్పారు. కెఆర్ ఎంబి , జిఆర్ ఎంబిల నిర్వహణ, మౌలిక సదుపాయాల కల్పనకు సమయం కావాలని అప్పటి వరకు రెండు బోర్డులకు సహకరిస్తామని హామీ ఇచ్చారు.
తెలంగాణా భవన్ శంకుస్థాపన కోసం ఆయన పర్యటన షెడ్యూల్ మూడు రోజులు మాత్రమే. రెండో తేదీన శంకుస్థాపన జరిగింది. ఇందుకోసం ఒకటో తేదీన వెళ్లారు. ఈ కార్యక్రమం అయిపోయాక తెల్లవారి తిరిగి రావాల్సి ఉంది. కానీ ఆయన ఇంకా ఢిల్లీలోనే ఉన్నారు.
ఆరు రోజులుగా ఢిల్లీలో పర్యటిస్తున్న సీఎం కేసీఆర్ వరుసగా కేంద్రమంత్రుల్ని కలుస్తున్నారు. నిన్న గజేంద్రసింగ్ షెకావత్ తోనూ, నితిన్ గడ్కరీతోనూ ఆయన సమావేశమయ్యారు. జల శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తో జల వివాదాలతో పాటు అనేక అంశాలపై చర్చించారు. కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుకు సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ పై తమ అభ్యంతరాలను షెకావత్ దృష్టికి తీసుకెళ్లారు.
కెఆర్ ఎంబి , జిఆర్ ఎంబి ల నిర్వహణ, మౌలిక సదుపాయాల కల్పనకు సమయం కావాలని, అప్పటి వరకు రెండు బోర్డులకు సహకరిస్తామని హామీ ఇచ్చారు. కొత్త కృష్ణా ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని, సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌ను వెనక్కి తీసుకుంటామని చెప్పారు. ఇప్పటికే ఉపసంహరణ దరఖాస్తు కూడా దాఖలు చేశామని చెప్పారు. అలాగే కృష్ణా జలాల్లో తెలంగాణకు 50 శాతం వాటా కావాలని షెకావత్‌ను కోరారు… కేసీఆర్. కృష్ణా నదిపై అనుమతిలేకుండా ఏపీ ప్రాజెక్టులు నిర్మిస్తోందని… ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని కేసీఆర్ ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. కృష్ణా, గోదావరి పరీవాహక ప్రాంతాల్లోని ప్రాజెక్టుల పరిస్థితిని… షెకావత్‌కు వివరించారు. దీనిపై కేంద్ర మంత్రి కూడా సానుకూలంగా స్పందించారట. ఇక నేడు మరికొంత మంది మంత్రులను కలిసే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం.