ముంద‌స్తుకు కేసీఆర్ వ్యూహం.. హింట్ ఇచ్చేశారా?

Update: 2022-05-18 01:30 GMT
తెలంగాణ ముఖ్య‌మంత్రి, రాజ‌కీయ మాట‌ల మాంత్రికుడు.. కేసీఆర్ మ‌రోసారి ముందస్తు ఎన్నిక‌ల‌కు వెళ్తున్నారా?  ఈ మేర‌కు ఆయ‌న సంకేతాలు ఇచ్చేశారా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. గ‌త టెర్మ్‌లోనూ.. కేసీఆర్ ముంద‌స్తుకు వెళ్లిన విష‌యం తెలిసిందే. 2014లో తెలంగాణ‌లో తొలిసారి విజయం ద‌క్కించుకుని సీఎం పీఠం ఎక్కిన కేసీఆర్‌.. వాస్త‌వానికి ఐదేళ్లు పూర్తి చేసుకుని 2019లో ఎఎన్నిక‌ల‌కు వెళ్లాల్సి ఉంది. అయితే.. ఆయ‌న ముందుగానే ఎన్నిక‌ల‌కువెళ్లారు. 2018లోనే అసెంబ్లీ ఎన్నిక‌లు వ‌చ్చాయి. అప్ప‌ట్లో త‌న‌పైనా.. త‌న ప్ర‌భుత్వంపై ప్ర‌తిప‌క్షాలు రాద్ధాంతం చేస్తున్నాయ‌ని.. అందుకే వాటి నోరు మూయించేందుకు తాను ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్తున్నాన‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు.

ఇక‌, ప్ర‌స్తుత విష‌యానికి వ‌స్తే.. సేమ్ సీన్ క‌నిపిస్తోంది. పైగా బీజేపీ దూకుడు మ‌రింత ఎక్కువ‌గా ఉంది. కేంద్రంలోని బీజేపీ నేత‌లు.. రాష్ట్రంపై ప్ర‌త్యేక దృష్టి పెట్టారు. ఇక‌, కాంగ్రెస్ కూడా ఇటీవ‌ల కాలంలో దూకుడు పెంచింది. దీంతో తెలంగాణ ఈ రెండు పార్టీలు అధికార పార్టీకి సెగ‌లు పుట్టిస్తున్నాయ‌నే చ‌ర్చ సాగుతోంది. ఈ నేప‌థ్యంలోనే కేసీఆర్ మ‌రోసారి ముంద‌స్తు మంత్రం ప‌ఠిస్తున్నార‌నే వాద‌న వినిపిస్తోంది. దీనికి బ‌లాన్ని చేకూరుస్తున్న‌ట్టుగా.. తెలంగాణ ముఖ్యమంత్రి న్నికల మూడ్‌లోకి వస్తున్నట్లు కనిపిస్తోంది.

జూన్ నుండి రాష్ట్రవ్యాప్త పర్యటనకు ఆయ‌న సిద్ధం అవుతున్న‌ట్టు తెలుస్తోంది. ఇదేస‌మ‌యంలో సిద్ధంగా ఉన్న దాదాపు లక్ష 2 బెడ్ రూం ఇళ్లను ల‌బ్ధి దారుల‌కు అందజేయడానికి ఆయ‌న ప్లాన్ చేసుకుంటున్నార‌ని స‌మాచారం. 2 బెడ్‌రూం గృహాల పథకం మొదట 2016-17లో ప్రకటించారు. ఒక్కో ఇంటికి 8 లక్షల చొప్పున మొత్తం 2,91,057 ఇళ్లను నిర్మించేందుకు ప్రణాళిక రూపొందించారు. అయితే.. ఈ ఇళ్ల నిర్మాణం క‌రోనా స‌హా ఆర్థిక స‌మ‌స్య‌ల కార‌ణంగా ఆల‌స్య‌మైంది. అయితే.. ప్ర‌స్తుతం ఆశించిన సంఖ్య‌లో ఈ ఇళ్లు పూర్త‌య్యాయి.

ప్ర‌స్తుతం ఈ ఇళ్ల‌ను ల‌బ్ధి దారుల‌కు ఇచ్చే కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్ట‌డాన్ని బ‌ట్టి కేసీఆర్ ముంద‌స్తు స‌న్నాహాల‌కు రెడీ అవుతు న్నార‌నే సంకేతాలు ఇస్తున్న‌ట్టేన‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. ప్ర‌స్తుతం ఉన్న రాజకీయాల‌ను చూస్తే.. ఇంత పెద్ద ఎత్తున స్థిరాస్తి ప‌థ‌కంలో భాగంగా ఇళ్లు పంచుతున్నారంటే అది కార‌ణ‌మ‌ని అంటున్నారు. దీనిని బ‌ట్టి తెలంగాణ త్వ‌ర‌లోనే ముంద‌స్తుకు వెళ్ల‌డం ఖాయ‌మ‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు.

కేసీఆర్ తన గత హయాంలో కూడా ఇలాంటి ప‌నే చేశారు. తెలంగాణలో ఎన్నికలు డిసెంబర్ 2023లో జరగాల్సి ఉంది. బహుశా ఈ ఏడాది ఆఖరులో జరిగే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంద‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఒక‌వైపు బీజేపీ అన్ని ప్రాంతాల్లోనూ విస్త‌రించేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ముఖ్యంగా పార్టీ రాష్ట్ర చీఫ్ బండి సంజ‌య్ ఇప్ప‌టికే రెండు విడ‌త‌లుగా సంగ్రామ యాత్ర పూర్తి చేసుకున్నారు. త్వ‌ర‌లోనే మూడో విడ‌త కూడా ప్రారంభించ‌నున్నారు. ఇది.. బీజేపీకి నైతిక బ‌లం చేకూర్చేందుకు నాయ‌క‌లుఉ ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఇదే జ‌రిగితే.. త‌న‌కు ముప్పు పొంచి ఉంటుంద‌ని భావిస్తున్న కేసీఆర్‌.. బీజేపీ పుంజుకునేలోగానే ముంద‌స్తుకు వెళ్లే ప్ర‌య‌త్నాల్లో ఉన్నార‌ని అంటున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.
Tags:    

Similar News