యాసంగి పంటపై సీఎం కేసీఆర్ కీలక ఆదేశాలు

Update: 2021-12-18 15:34 GMT
తెలంగాణలో ఏ పంట వేస్తే ఏం లాభం అన్నట్టుగా తయారైంది. సీఎం కేసీఆర్ సీఎం అయ్యాక ఉత్తరాన కాళేశ్వరం.. దక్షిణాన పాలమూరు రంగారెడ్డి కట్టి తెలంగాణ అంతటా ఎత్తిపోతలు పెట్టి పారించాడు. ఆ నీటితో తెలంగాణలో సిరుల పంట పండింది. కానీ కొనేవారేరి.. కేంద్రం కొనమనడంతో ఇప్పుడు యాసంగిలో ఏం వేయాలో తెలియక తెలంగాణ రైతాంగం తల పట్టుకుంది.

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణలో యాసంగి వరిధాన్యం కొనబోమని పదేపదే స్పష్టం చేసింది. పార్లమెంట్ లోనూ అదే చెప్పింది. యాసంగిలో కిలో వడ్లు కూడా కొనమని తెలిపింది. రాష్ట్రంలో యాసంగి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయబోవడం లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ప్రకటించారు.

కేంద్రం అనుసరిస్తున్న ప్రమాదకర విధానాల నుంచి రాష్ట్ర రైతాంగాన్ని కాపాడేందుకు క్షేత్రస్థాయిలోకి వెళ్లిధాన్యం కొనబోమనే విషయాన్ని అర్థం చేయించాలని సీఎం కేసీఆర్ కలెక్టర్లు, వ్వవసాయ అధికారులను సీఎం ఆదేశించారు.

తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేసే దిశగా తెలంగాణ రాష్ట్రం అమలు చేస్తున్న దార్శనిక వ్యవసాయ విధానాలు స్వతంత్ర భారత చరిత్రలో ఏ రాష్ట్రం అమలు చేయలేదని సీఎం కేసీఆర్ అన్నారు వీటిని కొనసాగిస్తామన్నారు.

రాబోయే వానాకాలం పంటల సాగుపై ముందస్తు ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని కేసీఆర్ అన్నారు. వానాకాలంలో ప్రధానంగా పత్తి, వరి, కందిసాగుపై దృష్టి సారించాలని కలెక్టర్లను వ్యవసాయ అధికారులను కేసీఆర్ ఆదేశించారు. రైతులను ప్రత్యామ్మాయ లాభసాటి పంటల సాగు దిశగా సమాయత్తం చేయాలన్నారు.


Tags:    

Similar News