ఏం చెబుతారు? చెప్పేదానిలో నిజం ఎంత? అబద్ధం ఎంత? ఇలాంటి లోతుల్లోకి వెళ్లటం లేదు. నేరుగా పాయింట్ లోకి వచ్చేస్తాం. ఏం చెప్పినా.. ఎలా చెప్పినా.. రాష్ట్రాలకు అతీతంగా తెలుగు ప్రజలంతా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మాటల్ని వినేందుకు ప్రదర్శించే ఆసక్తి అంతా ఇంతా కాదు. మాయదారి మహమ్మారి జడలు విప్పుతున్న వేళలో.. తన తీరుకు భిన్నంగా తరచూ మీడియా సమావేశాల్ని నిర్వహిస్తున్నారు సీఎం కేసీఆర్. తొలినాళ్లతో పోలిస్తే.. ఇప్పుడు ప్రెస్ మీట్ల మధ్య గ్యాప్ పెరుగుతోంది. లాక్ డౌన్ ను ఈ నెలాఖరు వరకు కొనసాగిస్తూ.. కేంద్రం విడుదల చేసిన తాజా మార్గదర్శకాలతో పాటు.. ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలపై మీడియాతో మాట్లాడేందుకు కేసీఆర్ సిద్ధమవుతున్నారు.
ఈ రోజు (సోమవారం) సాయంత్రం 5 గంటలకు కేబినెట్ భేటీ షురూ కానుంది. సీఎం కేసీఆర్ ప్రత్యేకత ఏమంటే.. మిగిలిన ముఖ్యమంత్రుల మాదిరి ఉదయం పది గంటలకో.. పదకొండు గంటలకో కాకుండా సాయంత్రం షురూ చేయటం.. అది కాస్తా దగ్గర దగ్గర నాలుగైదు గంటల పాటు సాగటం.. ఆ తర్వాత ప్రెస్ మీట్ గంటకు పైనే నిర్వహించటం తెలిసిందే. ఈ రోజుకూడా అలాంటి పరిస్థితే ఉంటుందని చెబుతున్నారు.
మంత్రివర్గ సమావేశాన్ని మమ అన్నట్లు కాకుండా.. తాను తీసుకునే నిర్ణయాలకు సంబంధించిన చాలా అంశాల్ని చెప్పటంతో పాటు.. ప్రభుత్వ ఆలోచనలు.. దానికి దారి తీసిన పరిస్థితులు.. పరిణామాల గురించి మంత్రులతో పంచుకోవటంతో పాటు..కొందరి అభిప్రాయాల్ని అడిగి తెలుసుకునే అలవాటు కేసీఆర్ కు ఉందని చెబుతారు. ఈ కారణంతోనే కేబినెట్ భేటీ గంటల కొద్దీ సాగుతుందని చెబుతారు.
సాయంత్రం ఐదు గంటలకు కేబినెట్ సమావేశం అంటే.. కనీసం రాత్రి పది గంటల వరకూ సాగాలి. తర్వాత ప్రెస్ మీట్ అంటే.. తక్కువలో తక్కువ గంట నుంచి గంటన్నర వరకూ సాగుతుంది. కాస్త గ్యాప్ తీసుకొని మీడియా ముందుకు కేసీఆర్ వస్తున్నారంటే ఆయన దగ్గర బోలెడన్ని విషయాలు ఉంటాయి. వాటి గురించి తెలుసుకోవటానికి తెలుగు ప్రజలకు ఉండే ఆసక్తి అంతా ఇంతా కాదు. ఈ నేపథ్యంలో ఈ రోజు కేసీఆర్ ప్రెస్ మీట్ అయ్యాకే నిద్ర పోవటం ఖాయం. సారు మీడియా సమావేశం కారణంగా.. ఈ రోజు తెలుగు ప్రజలకు కేసీఆర్ సెకండ్ షో ఖాయమని చెప్పక తప్పదు.