తెలంగాణ‌లో ఒప్పంద ఉద్యోగాల బంద్‌: కేసీఆర్

Update: 2017-10-27 16:55 GMT
త‌న సంచ‌ల‌న నిర్ణ‌యాల‌తో వార్త‌ల్లో నిలిచి అంద‌రినీ ఆక‌ట్టుకునే తెలంగాణ సీఎం కేసీఆర్‌.. ఉద్యోగుల విష‌యంలో చేసిన తాజా ప్ర‌క‌ట‌న మ‌రింత సంచ‌ల‌నంగా మారింది. తెలంగాణ‌లో ఇక‌పై ఒప్పంద‌(కాంట్రాక్ట్‌) ఉద్యోగాలు ఉండ‌వ‌ని బాంబు పేల్చారు. అదేస‌మ‌యంలో ఇప్ప‌టికే ఉన్న ఒప్పంద‌, పొరుగు(ఔట్ సోర్సింగ్‌) సేవ‌ల సిబ్బందికి వేత‌నాలు పెంచ‌డం - వారికీ భ‌త్యాల నిర్ణ‌యం వంటి కీల‌క అంశాల‌పై దృష్టి పెట్టిన‌ట్టు చెప్పారు. రాబోయే రోజుల్లో ఈ ఉద్యోగులకు గోల్డెన్ లైఫ్ ఖాయ‌మ‌ని సీఎం చెప్ప‌డం గ‌మ‌నార్హం. ఈ మేర‌కు ఆయ‌న శుక్ర‌వారం తెలంగాణ అసెంబ్లీలో ప్ర‌శ్నోత్త‌రాల స‌మ‌యంలో స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెప్పారు. ప్ర‌ధానంగా రాష్ట్రంలోని హిందూ ఆల‌యాలు - ముస్లిం మ‌సీదుల్లో పూజ‌లు - ప్రార్థ‌న‌లు చేసే అర్చ‌కులు - ఇమామ్‌ ల సంక్షేమానికి ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉంద‌ని చెప్పారు.

అర్చకులు - సిబ్బంది వేతనాలపై సభ్యులు చేసిన సూచనలను పరిగణలోకి తీసుకుంటామని కేసీఆర్‌ అన్నారు. అర్చకులు - ఇమామ్‌ లను ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుంటుందని చెప్పారు. వారి వేతనాలపై పరిశీలిస్తామన్నారు. సభ్యుల సూచనలను పరిగణలోకి తీసుకుంటామని.. అసెంబ్లీ సమావేశాలు ముగిసేలోపు సభ్యులతో భేటీ ఏర్పాటు చేస్తామని తెలిపారు.  రాష్ట్రంలో 5,625 మంది అర్చకులకే ట్రెజరీ ద్వారా జీతాలు ఇస్తున్నారని.. అయితే,  అన్ని దేవాలయాల సిబ్బందికి ట్రెజరీ ద్వారా జీతాలు ఇవ్వాలన్న బీజేపీ పక్ష నేత కిషన్‌ రెడ్డి సూచన‌ల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని చ‌ర్య‌లు చేప‌డ‌తామ‌ని కేసీఆర్ హామీ ఇవ్వ‌డం గ‌మ‌నార్హం.

ఇక‌, రాష్ట్రంలోని ప్ర‌భుత్వ ఉద్యోగులు అర్ధాకలితో పనిచేస్తుంటే గత ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు చేపట్టలేదని సీఎం విమర్శించారు. అర్ధాకలితో ఎవరూ పనిచేయవద్దని.. ఈ క్ర‌మంలో వారికి మెరుగైన జీతాలు - భ‌త్యాలు చెల్లించేందుకు తెలంగాణ‌ ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలిపారు. సిబ్బందిని క్రమబద్ధీకరిస్తామంటే కోర్టులకు వెళ్లి అడ్డుకుంటున్నారని విప‌క్షాల‌పై కేసీఆర్ తీవ్ర‌స్థాయిలో అసెంబ్లీలోనే మండిపడ్డారు. సిబ్బంది క్రమబద్ధీకరణలో రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ పాటిస్తామన్నారు. శాశ్వత ఉద్యోగాల కోసం ఔట్‌ సోర్సింగ్‌ తీసుకోవడం నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. భవిష్యత్‌ లో ఒప్పంద - పొరుగు సేవల ఉద్యోగాల నియామకాలు చేపట్టేది లేదని సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు.

అదేస‌మ‌యంలో స‌రైన వేత‌నాలు లేక‌ - భ‌త్యాలు అంద‌క ఇబ్బంది ప‌డుతున్న‌ ప్రస్తు త‌ ఒప్పంద - పొరుగు సేవల సిబ్బందిని అన్ని రకాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. కేసీఆర్ ప్ర‌క‌ట‌న‌తో ఆయా రంగాల్లోని ఒప్పంద‌ - కాంట్రాక్టు ఉద్యోగులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తుండ‌గా - నిరుద్యోగులు మాత్రం తీవ్ర నిరాశ‌లో కూరుకుపోయారు. ఏదో ఒక ఉద్యోగం అది ఒప్పంద‌మో - కాంట్రాక్టో ప్ర‌భుత్వ కొలువు ద‌క్కుతుంద‌ని ఆశ‌ప‌డ్డ వీరు ఇప్పుడు సీఎం ప్ర‌క‌ట‌న‌తో అస‌లు ఒప్పంద ఉద్యోగాల‌కే ఎస‌రు రావ‌డంపై ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. పోనీ.. అన్ని ఉద్యోగాల‌ను రెగ్యుల‌ర్ ప్రాతిప‌దిక‌న తీసుకుంటారా? అన్న విష‌యంలో సీఎం కేసీఆర్ క్లారిటీ ఇస్తే బాగుండేద‌ని అంటున్నారు. మ‌రి దీనిపై టీఆర్ ఎస్ అధినేత ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. నిరుద్యోగుల‌కు తీపి అందిస్తారో లేదో చూడాలి.
Tags:    

Similar News