సిద్ధిపేటకు ఎయిర్ పోర్ట్... తీపి కబురు చెప్పిన సీఎం కేసీఆర్ !

Update: 2020-12-10 08:57 GMT
తెలంగాణ సీఎం కేసీఆర్ నేడు సిద్దపేట జిల్లా పర్యటనలో ఉన్నారు. గురువారం ఉదయం కొండపాక మండలం దుద్దెడ చేరుకున్న సీఎం... మంత్రి తన్నీరు హరీశ్‌ రావు తో కలిసి రూ.45 కోట్లతో సిద్ధిపేట శివారులో నిర్మించనున్న ఐటీ టవర్ నిర్మాణంకు శంకుస్థాపన చేశారు. సీఎం కేసీఆర్‌ సమక్షంలో నాలుగు ఐటీ కంపెనీలు సిద్ధిపేట ఐటీ టవర్‌ లో వారి సంస్థల ఏర్పాటుకు ఒప్పందాలను కుదుర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో జోలాన్ టెక్నాలజీ, విసాన్ టెక్ ,ఎంబ్రోడ్స్ టెక్నాలజీ, సెట్విన్ కంపనీలు పాల్గొన్నాయి.

ఆ తర్వాత సీఎం కేసీఆర్ మాట్లాడుతూ ... సిద్ధిపేట పట్టణం ఎంతో అభివృద్ధి చెందిందని, సిద్దిపేట చాలా డైనమిక్‌ ప్రాంతమని సీఎం కేసీఆర్‌ ప్రశంసించారు. సిద్దిపేట పట్టణం హైదరాబాద్‌ మహా నగరానికి అతి దగ్గరలో ఉందని తెలిపారు. భవిష్యత్తులో సిద్ధిపేటకు ఎయిర్ పోర్ట్ వచ్చే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. ఆ తర్వాత సిద్దిపేట అర్బన్ మండలంలోని మిట్టపల్లి గ్రామంలో రూ.22 లక్షలతో నిర్మించిన రైతు వేదికను ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్‌ ప్రారంభించారు. సిద్ధిపేట నియోజకవర్గంలో సీఎం కేసీఆర్‌ పర్యటనలో భాగంగా రూ.135 కోట్లతో నిర్మించిన ప్రభుత్వ మెడికల్ కళాశాలను మంత్రి హరీశ్‌తో కలిసి సీఎం కేసీఆర్‌ ప్రారంభించారు. అదే విధంగా ప్రభుత్వ మెడికల్ కళాశాల అవరణలో రూ.225 కోట్లతో కొత్తగా నిర్మించనున్న 960 పడకల ఆస్పత్రికి సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన చేశారు.


Tags:    

Similar News