తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నోటి నుంచి వచ్చిన తాజా ఆదేశం విన్నారా? తాను అనుకోవాలే కానీ.. ఎలాంటి నిర్ణయాన్ని అయినా తీసుకునే సత్తా తనకుందన్న విషయాన్ని మరోసారి ఆయన నిరూపించారు. కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టం ప్రకారం రైతులు పండించిన పంటను ప్రభుత్వం కొనలేదని స్పష్టం చేసిన ఆయన.. గత ఏడాది మాదిరి కొనండి సారూ అంటే ససేమిరా అన్నారు. అలాంటి కేసీఆర్.. మంగళవారం హడావుడిగా ఏర్పాటు చేసిన రివ్యూ సమావేశంలో ఆసక్తికర ఆదేశాన్ని ఇవ్వటమే కాదు.. యుద్ధ ప్రాతిపదికన దాన్ని అమలు చేయాలన్నారు.
రాష్ట్రంలో పండిన ప్రతి ధాన్యపు గింజనూ ప్రభుత్వం కొంటుందని.. ధాన్యం కొనుగోళ్ల కోసం 6408 కేంద్రాల్ని ఏర్పాటు చేస్తామని.. అందుకుఅవసరమైన రూ.20వేల కోట్ల కోసం బ్యాంకు పూచీకత్తు ఏర్పాటును మంగళవారానికి పూర్తి చేయాలంటూ వరుస పెట్టి తీసుకున్న ఆదేశాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. కేసీఆర్ మనసును ఇంతలా మార్చిందేమిటి? గతంలో ఆయన చెప్పిన మాటలు ఎందుకు మారాయి? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.
కరోనా కేసులు మళ్లీ పెరిగిపోతున్న వేళ.. రైతుల ప్రయోజనాల్ని పరిగణలోకి తీసుకొని గత సీజన్ల మాదిరే ధాన్యం కొనుగోలు చేస్తామన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం.. కొనుగోళ్లు సరిగా సాగుతున్నాయా? లేదా? అన్న విషయాన్ని స్వయంగా తెలుసుకోవాలంటూ వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డికి సూచన చేశారు. మార్కెటింగ్ శాఖను సమన్వయం చేసుకుంటూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.
ఇంతకూ కేసీఆర్ ఈ నిర్ణయాన్ని తీసుకోవటానికి కారణం ఏమిటి? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. గతంలో తనకు తిరుగులేదన్నట్లుగా భావించిన కేసీఆర్.. వరుస పెట్టి తనకు తోచిన నిర్ణయాలు తీసుకోవటంతో ప్రభుత్వ ఉద్యోగులు మొదలు విద్యార్థులు.. యువత.. ఇలాఒక్కొక్క వర్గం పార్టీకి దూరం కావటం.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారుతున్నారు. ఇటీవల జరిగిన దుబ్బాక.. గ్రేటర్ ఎన్నికలఫలితాలు ఆయన ఆలోచన ధోరణిని మార్చాయని చెబుతున్నారు. ఎంత అధికారంలో ఉన్నా.. ప్రభుత్వ వ్యతిరేకత రాకుండా జాగ్రత్తలు తీసుకోకుంటే.. బీజేపీకి అవకాశం ఇచ్చినట్లు అవుతుందన్న భావనకు వచ్చినట్లు చెబుతున్నారు. దీనికి తోడు.. తాజాగా జరుగుతున్న సాగర్ ఉప ఎన్నిక మీద ప్రభావం పడకుండా చూసుకోవాల్సి ఉందని.. అందుకే రాష్ట్రంలోని రైతులందరికి ప్రభుత్వమే పంటను కొంటుందన్న శుభవార్తను చెప్పినట్లుగా చెబుతున్నారు. గతంలో మాదిరి కాకుండా.. అందరిని కలుపుకు వెళ్లేలా ఉండటమే కేసీఆర్ తాజా ప్లానింగ్ గా చెబుతున్నారు. మరెంత కాలం ఈ తీరును ప్రదర్శిస్తారో చూడాలి.