బీజేపీకి నితీష్ కుమార్ మాస్టర్ స్ట్రోక్!

Update: 2022-08-10 05:08 GMT
బీహార్‌లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోయాయి. రాష్ట్రంలో బీజేపీతో పొత్తు ముగిసిన కొద్ది గంటలకే సీఎం నితీశ్ కుమార్ మంగళవారం రాజీనామా సమర్పించారు.

మహారాష్ట్రలో మాదిరిగానే జేడీయూలో కూడా చీలిక తెచ్చి మరో ఏక్ నాథ్ షిండేను తయారు చేసి తనను గద్దెదించేందుకు కేంద్ర హోంమంత్రి, బీజేపీ సీనియర్ నేత అమిత్ షా యోచిస్తున్నారని నితీష్ సంచలన ఆరోపణలు చేశారు. అందుకే  బీజేపీతో తన పొత్తును ముగించుకున్నట్టు సంచలన ప్రకటన చేశారు.

మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్దవ్ ఠాక్రేలా కాకుండా  నితీష్ కుమార్ ముందే తేరుకున్నారు.  తెలివిగా వ్యవహరించి బీజేపీతో తెగతెంపులు చేసుకోవడం ద్వారా తొలి ఎత్తుగడ వేశారు. వెంటనే ప్రతిపక్ష ఆర్జేడీ తేజస్వి యాదవ్ మరియు ఇతర ప్రతిపక్ష పార్టీలతో జట్టుకట్టాడు. దానిని "మహాగట్బంధన్" అకా మహా కూటమిగా పేర్కొన్నాడు. ఈరోజు మధ్యాహ్నం 2 గంటల తర్వాత నితీష్ కుమార్ సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. డిప్యూటీ సీఎంగా 32 ఏళ్ల తేజస్వి యాదవ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

"ఏడు పార్టీల మహాఘటబంధన్ (మహాకూటమి), ఒక ఇండిపెండెంట్ కలిసి నితీష్ కుమార్ సారథ్యంలో కొత్త ప్రభుత్వంలో పని చేస్తారు. నితీష్ కుమార్ నిన్న గవర్నర్‌తో తన రెండవ సమావేశం తర్వాత ఈ మేరకు క్లారిటీ ఇచ్చాడు. తొలి సమావేశంలో జేడీయూ, బీజేపీలు ఏర్పాటు చేసిన ప్రభుత్వ సీఎం పదవికి నితీశ్ రాజీనామా సమర్పించారు.

తొమ్మిదేళ్లలో నితీష్ రెండోసారి బీజేపీ నుంచి విడిపోయారు. మంగళవారం తన పార్టీ ఎమ్మెల్యేలతో జరిపిన ఇంటరాక్షన్, వారి ఫీడ్‌బ్యాక్ ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ముందుగా చెప్పారు. నితీష్ తన పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించినప్పటికీ తేజస్వి యాదవ్ ఆర్జేడీ ఎమ్మెల్యేలతో సమాంతర సమావేశాన్ని నిర్వహించారు. దీనిలో కొత్త ప్రభుత్వంలో నితీష్ కుమార్‌తో కలిసి పనిచేయడానికి తన పార్టీ ఎమ్మెల్యేల మద్దతును కోరాడు.

“బిజెపి తన మిత్రపక్షాలందరికీ ద్రోహం చేస్తుంది. ఇతరులను బెదిరిస్తుంది” అని తేజస్వి యాదవ్ నిన్న నితీష్ కుమార్‌తో కలిసి మీడియాతో మాట్లాడుతూ అన్నారు. మరోవైపు, మధ్యంతర కాలంలో భాగస్వాములను మార్చడం ద్వారా నితీష్ కుమార్ "ప్రజల ఆదేశానికి ద్రోహం" చేశారని బిజెపి ఆరోపించింది. మొత్తానికి బీజేపీకి నితీష్‌ కుమార్‌ ఇచ్చిన మార్క్‌ మాస్టర్‌ స్ట్రోక్‌ వైరల్ అయ్యింది.
Tags:    

Similar News