ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత సహాయకుడు నారాయణ అనారోగ్యం తో మృతి చెందారు. వైఎస్ కుటుంబంతో దాదాపు మూడు దశాబ్దాల కు పైనే అనుబంధం ఉన్న నారాయణ ను కుటుంబ సభ్యుడిగా భావిస్తారు. ఆయన తో జగన్ కున్న అనుబంధం ఎక్కువ. నారాయణ మరణించిన వార్త గురించి సమాచారం అందుకున్న వెంటనే ఢిల్లీలో ఉన్న జగన్.. తన షెడ్యూల్స్ ను రద్దు చేసుకున్నారు.
వాస్తవానికి ఈ రోజు ప్రధాని మోడీ తో పాటు హోంమంత్రి అమిత్ షాతోనూ భేటీ కావాల్సి ఉంది. అయితే.. తమకెంతో ఆప్తుడైన నారాయణ మరణించిన సమాచారంతో వెనువెంటనే ఢిల్లీ నుంచి కడపకు బయలుదేరారు. అక్కడి నుంచి అనంతపురం జిల్లా నారాయణ సొంతూరైన దిగువ పల్లెకు వెళ్లనున్నారు. వ్యక్తిగత సహాయకుడు నారాయణ మరణ వార్తకు సంబంధించిన ఫోన్ కాల్ వచ్చినంతనే తన షెడ్యూల్స్ ను క్యాన్సిల్ చేసుకున్నారు జగన్.
నారాయణ ను కడసారి చూసేందుకు జగన్ హుటాహుటిన అనంతపురం జిల్లా కు బయలుదేరారు. సాయంత్రం 3.30 గంటల సమయానికి నారాయణ ఇంటికి చేరుకునే అవకాశం ఉందంటున్నారు. అక్కడ నుంచి నేరుగా తాడేపల్లికి సీఎం జగన్ వెళ్లనున్నారు.