మోడీ క్యాబినెట్ లో ఫస్ట్.. లాస్ట్..?

Update: 2016-05-01 04:29 GMT
మోడీ సర్కారు అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్న సంగతి తెలిసిందే. మరి.. ఈ రెండేళ్లలో మోడీ పని తీరు మీద ఇప్పటికే అంచనాలు వచ్చేసిన సంగతి తెలిసిందే. మోడీ సంగతి పక్కన పెడితే.. ఆయన క్యాబినెట్ లోని మంత్రుల పని తీరు మాటేమిటి? అన్నప్రశ్నకు ఆసక్తికర సమాధానమే వస్తుంది. అధినేత ఒక్కరు పని చేస్తేనే ప్రభుత్వానికి మంచిపేరు రాదన్న సంగతి తెలిసిందే. మరి.. మోడీ టీంలోని మంత్రుల పనితీరు ఎలా ఉంది? వారి పనితీరు విషయంలో ప్రజల మాటేమిటి? అన్న ప్రశ్నలకు సీఎంఎస్ తన సర్వే వివరాల్ని పేర్కొంది. పది మార్కుల స్కేల్ లో వారి పనితీరు ఆధారంగా మంత్రులకు మార్కులు ఇచ్చారు. శాఖల వారీగా పని తీరును మార్కుల్లో చూసినప్పుడు టాప్ ఫైవ్ శాఖల్ని చూస్తే..

1.        రైల్వే శాఖ      (6.36/10)

2.        ఆర్థిక శాఖ      (6.22/10)

3.        విదేశాంగ శాఖ  (5.55/10)

4.        హోం శాఖ        (5.48/10)

5.        రవాణా శాఖ     (5.12/10)

= పట్టణాభివృద్ధి శాఖకు (వెంకయ్యనాయుడు మంత్రిగా ఉన్న) 15వ ర్యాంకు

= గ్రామీణాభివృద్ధి శాఖ 18వ ర్యాంకు కాగా.. 19వ ర్యాంకులోన్యాయశాఖ నిలిచింది. కార్మిక శాఖ పాయింట్ల పట్టికలో ఆఖరు స్థానంలో ఉంది.

మంత్రుల వారీగా టాప్ ఫైవ్ ర్యాంకుల్ని చూస్తే..

1.        సుష్మాస్వరాజ్

2.        రాజ్ నాథ్ సింగ్

3.        సురేశ్ ప్రభు

4.        మనోహర్ పారీకర్

5.        అరుణ్ జైట్లీ

= అంచనాలు ఎక్కువగా ఉన్న కేంద్రమంత్రులు వెంకయ్య.. స్మృతి ఇరానీల పని తీరు యావరేజ్ మాత్రమే

= మోడీ జట్టులో చివరి స్థానాల్లో ఉన్న మంత్రులు.. రామ్ విలాస్ పాశ్వాన్.. బండారు దత్తాత్రేయ.. రాధామోహన్ సింగ్.. జేపీ నడ్డా.. ప్రకాష్ జవదేకర్ లు

= మోడీ జట్టులో మైనస్ మార్కులు సాధించిన మంత్రులూ ఉన్నారు. వారు.. దత్తాత్రేయ.. రామ్ విలాస్ పాశ్వాన్.. రాధామోహన్ సింగ్ లు

= సున్నా మార్కులు వచ్చిన మంత్రిగా జేపీ నడ్డా నిలవగా.. ప్రకాశ్ జవదేకర్ కు 0.2 మార్కులు రావటం గమనార్హం
Tags:    

Similar News