దేశం కోసం నా కొడుకు అమరుడైనందుకు గర్వంగా ఉంది: కల్నల్ సంతోశ్ తల్లి !

Update: 2020-06-16 19:00 GMT
గాల్వాన్ లోయలో భారత్-చైనా సైనికుల మధ్య జరిగిన  ఘర్షణలో సుమారుగా 20 మంది భారత జవాన్లు మృతి చెందిన సంగతి తెలిసిందే. వీరిలో తెలంగాణ, సూర్యాపేటకు చెందిన కల్నల్ బిక్కుమల్ల సంతోష్ బాబుకూడా వీరమరణం పొందాడు. కల్నల్ సొంతోష్ మరణం పై అయన తల్లి స్పందించింది. తల్లిగా బాధగా ఉంది.. కానీ, నా కుమారుడు దేశం కోసం అమరుడైనందుకు గర్వంగా ఉంది అంటూ చెప్పింది. కానీ , ఓ తల్లిగా నాకు భాదగా కూడా ఉందని తెలిపింది తల్లి మంజుల

ఒక్కగానొక్క కుమారుడు దేశం కోసం ప్రాణాలు కోల్పోయాడు. అయినా.. ఆ తల్లిదండ్రుల్లో ధైర్యం ఏమాత్రం చెక్కుచెదరలేదు. వారిలో ఆ జవాన్ నింపిన ధైర్యం అలాంటిది. ఇండియన్ ఆర్మీ పవర్ అలాంటిది. తనకు మరణం ఏ సమయంలో, ఏ రూపంలో వచ్చినా కుంగిపోవద్దని తల్లిదండ్రులకు, భార్యకు ధైర్యం నూరిపోశాడు. తన కుమారుడు ఇచ్చిన బలంతోనే ఆ మాతృమూర్తి.. ఉబికివస్తున్న కన్నీళ్లను కూడా దిగమింగుకొని ధైర్యంగా నిల్చున్నారు.అమ్మా.. హైదరాబాద్ ట్రాన్స్‌ఫర్ అయిందిగా, ఇంకో నెల రోజుల్లో వచ్చేస్తా అని తన కుమారుడు చెప్పాడని, చివరిసారిగా ఆదివారం (జూన్ 14) తనతో ఫోన్లో మాట్లాడినట్లు ఆమె తెలిపారు. తన కుమారుడు ఇప్పటికే హైదరాబాద్ రావాల్సి ఉన్నా.. కరోనా లాక్‌డౌన్ వల్ల ఆలస్యమైందని, అక్కడికి రావాల్సిన బలగాలు ఇంకా చేరుకోకపోవడం వల్ల అక్కడే ఉండిపోయాడని ఆమె తెలిపారు.

అలాగే సంతోష్ తండ్రి మాట్లాడుతూ ..దేశం కోసం సైనికుడిగా పనిచేయాలని తనకు బలంగా ఉండేదని, కొన్ని కారణాల వల్ల తాను ఆ అవకాశం పొందలేకపోయానని వివరించారు. బ్యాంక్ మేనేజర్‌ గా పనిచేసి రిటైర్డ్ అయిన ఆయన సూర్యాపేటలో నివాసం ఉంటున్నారు. సైన్యంలో పనిచేయాలనేది నా కల. నా కలను కొడుకు రూపంలో చూసుకున్నాను. అతడిని ముందు నుంచే ఆ లైన్లో తయారు చేశాను. కోరుకుండ సైనిక్ స్కూల్లో చదివించాను. అతడి కోసం నేను 800 కి.మీ. ట్రాన్స్‌ఫర్ చేయించుకొని అక్కడికి వెళ్లాను అని ఆయన చెప్పారు. సంతోశ్ బాబు భార్య పేరు సంతోషి. వీరికి కుమార్తె అభిజ్ఞ (9), కుమారుడు అనిరుధ్‌ (4) ఉన్నారు.
Tags:    

Similar News