కమెడియన్ పృథ్వీ.. 30 ఇయర్స్ ఇండస్ట్రీ అనే డైలాగ్ తో సినిమాల్లో పాపులర్ అయ్యారు. చాలా సినిమాల్లో కమెడియన్ గా అలరించిన పృథ్వీ ఈ మధ్య జగన్ కు మద్దతు తెలిపి.. ఆయనతో కలిసి పాదయాత్రలో పాల్గొన్నారు.తన ఫుల్ సపోర్ట్ జగన్ కే అని తేల్చిచెప్పారు..
పృథ్వీ ఇలా జగన్ కు సపోర్టు చేశారో లేదో అలా టీడీపీ అనుకూల నెటిజన్ మూకలు రెచ్చిపోయాయి. పృథ్వీ - పోసాని - కృష్ణుడు ఇలా జగన్ కు సపోర్టు చేసిన వారందరినీ సోషల్ మీడియాలో కుక్కలంటూ పోస్టులు పెట్టారు. దీనిపై తాజాగా పృథ్వీ రెచ్చిపోయారు. గుంటూరులో జరిగిన ‘వంచనపై గర్జన’ దీక్షలో పాల్గొన్న ఆయన టీడీపీ అనుకూల వర్గాలకు దిమ్మదిరిగే కౌంటర్లు ఇచ్చారు.
పృథ్వీ మాట్లాడుతూ.. ‘కుక్కలంటే విశ్వాసంగా ఉంటాయిరా బచ్చాల్లారా’ అంటూ ఒక్క డైలాగుతో వాళ్ల నోళ్లు మూయించారు. అంతేకాదు.. 40ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు.. 40 ఏళ్ల వయసున్న జగన్ ను చూస్తే ఎందుకు భయపడుతున్నారని పృథ్వీ హాట్ కామెంట్స్ చేశారు..తనకు ఎక్కడ పశువులు కనిపించినా వాటిల్లో ఫిరాయింపు ఎమ్మెల్యేల ముఖాలే కనిపిస్తున్నాయంటూ సెటైర్ వేశారు. రాష్ట్రంలో ప్రత్యేక హోదా నిలబడుతుందంటే అది వైసీపీ - జగన్ వల్లేనని పృథ్వీ స్పష్టం చేశారు.