టాలీవుడ్ కమెడియన్ విజయ్ సాయి ఆత్మహత్య రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సంచలనం రేపిన సంగతి తెలిసిందే. తన భార్య వనితతోపాటు - అడ్వకేట్ శ్రీనివాస్ - శశిధర్ లు మానసికంగా వేధించడం వల్లే తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నానని విజయ్ సూసైడ్ చేసుకున్న విషయం విదితమే. విజయ్ విడుల చేసిన సెల్ఫీ వీడియోలో పేర్కొన్న విషయాలను అతడి భార్య వనిత ఖండిస్తూ....తనకు, విజయ్ ఆత్మహత్యకు ఏమాత్రం సంబంధంలేదని చెప్పి అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. తనపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని - తానెక్కడికీ పారిపోలేదని - అన్ని ఆధారాలతో వచ్చి పోలీసులకు లొంగి పోతానని చెబుతూ...వనిత ఓ చానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇప్పటికే విజయ్ సూసైడ్ కేసులో....ఆమెకు పోలీసులు నోటీసులు జారీచేశారు. ఈ నేపథ్యంలో వనిత బుధవారం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయింది. ప్రస్తుతం పోలీసులు ఆమెపై విచారణ జరుపుతున్నారు. విచారణ అనంతరం పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకునే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. పోలీసులకు లొంగిపోవడానికి ముందు మీడియాతో మాట్లాడిన వనితా రెడ్డి అనేక ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
తానెక్కడికీ పారిపోలేదని, పోలీసులు తనకు నోటీసులిచ్చినందు వల్లే తన వాదన వినిపించేందుకు వచ్చానని తెలిపారు. తాను సేకరించిన ఆధారాలను పోలీసులకు ఇస్తానని, అవి చూసిన తర్వాత పోలీసుల నిర్ణయం ప్రకారం నడుచుకుంటానని చెప్పింది. ఈ 11 రోజులపాటు తాను ఎక్కడికీ వెళ్లలేదని, తన కూతురు కోసమే దూరంగా ఉన్నానని తెలిపింది. విజయ్ ఆత్మహత్యకు తాను కారణం కాదని, ఆ కారణాలను తాను కూడా తెలుసుకోవాల్సి ఉందన్నారు. తాను, విజయ్ విడిపోయి మూడేళ్లయిందని, అటువంటిది ఇపుడు తనపై ఆరోపణలు చేస్తూ విజయ్ సూసైడ్ ఎందుకు చేసుకున్నాడో తనకు తెలీదన్నాడు. విజయ్ పై బురద జల్లేందుకు తాను విజయ్ వ్యక్తిగత ఫొటోలను విడుదల చేయలేదని - తనపై ఆరోపణలు వచ్చినందునే వాటిని బయటపెట్టాల్సి వచ్చిందన్నారు. తన అత్తమామలు తనను వేధిస్తున్నారని - ఆ అమ్మాయిల భవిష్యత్ గురించి ఆలోచించి ఆ ఫొటోలను ఇప్పటివరకు బయటపెట్టలేదన్నారు. విజయ్ ను తాను వేధించలేదని - అది నిరూపించడానికే ఇపుడు పోలీసుల ముందుకు వచ్చానని చెప్పింది. తనకు శశిధర్ ఎవరో తెలీదని - తన లాయర్ శ్రీనివాస్ అని - తన తండ్రే తనకు స్విఫ్ట్ కారు కొనిచ్చారన్నారు.