ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ కొద్ది నెలలుగా సాగుతున్న ఆందోళనలు ఒక కొలిక్కి వస్తున్నాయి. ఈ అంశాన్ని ఇంతకాలం పెద్దగా పట్టించుకోని విపక్షాలు ఇప్పుడిప్పుడే దీనిపై సీరియస్ గా లుక్ వేస్తున్నాయి.
ఈ అంశంతో ఢిల్లీలో ఆందోళన చేపట్టాలని ఏపీ ప్రధాన విపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిసైడ్ అయితే.. రానున్న రోజుల్లో ఇదే అంశాన్ని పార్లమెంటులో ప్రస్తావించి.. అవసరమైతే సభను స్తంభింపచేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఇక.. తమ అమ్ముల పొదిలో ఆయుధమైన ఆందోళనలు.. నిరసనలతో రచ్చ రచ్చ చేయాలని కమ్యూనిస్టు పార్టీలు భావిస్తున్నాయి.
ఇందులో భాగంగా ఈ నెల 11న ఆంధ్రప్రదేశ్ బంద్ కు సీపీఐ పిలుపునిచ్చింది. ఆగస్టు 10 వరకుసాగే పార్లమెంటు సమావేశాల్లో ప్రత్యేక హోదాపై అధికారిక ప్రకటననుమోడీ సర్కారు చేయాలని.. లేనిపక్షంలో 11న ఏపీ బంద్ ను నిర్వహిస్తామని సీపీఐ హెచ్చరిస్తోంది. ఏపీ ఎంపీలు పార్లమెంటులో నోరు విప్పటం లేదని.. పదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని బీరాలు పలికిన వెంకయ్యనాయుడు.. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ విషయం గురించి మాట్లాడటం లేదంటూ సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ చెప్పారు. మొత్తంగా ఏపీ ప్రత్యేక హోదాపై నిరసనలు.. ఆందోళనలు.. బంద్ ల వరకూ వచ్చాయన్న మాట.