ప్రియాంకగాంధీపై అసభ్య ప్రచారం.. ఫిర్యాదు

Update: 2019-02-14 06:45 GMT
సోషల్ మీడియా పెచ్చరిల్లుతోంది. వాస్తవాలు బేరీజు వేసుకోకుండా వైరల్ కోసం పెడుతున్న పోస్టులు ప్రముఖుల పరువు తీసేలా కనిపిస్తున్నాయి. వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగేలా పెడుతున్న పోస్టులకు సామాన్యుల నుంచి ప్రజాప్రతినిధుల దాకా బలైపోతున్నారు.

తాజాగా తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నేరెళ్ల శారద జాతీయ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ పట్ల కొందరు అసభ్య ప్రచారం చేస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె వ్యక్తిగత జీవితం పట్ల కొందరు సోషల్ మీడియాలో పిచ్చి రాతలు రాస్తున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

ట్విట్టర్, ఫేస్ బుక్ లో ప్రియాంక గాంధీపై పెట్టిన పోస్టుల ఆధారంగా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నేరెళ్ల శారద తాజాగా హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రియాంక గాంధీపై సోషల్ మీడియాలో పదుల సంఖ్యలో అభ్యంతరకర వీడియోలు, ఫొటోలు, కార్టూన్లు ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు.  ఈ మేరకు వారిని గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నాలు ప్రారంభించారు.
   

Tags:    

Similar News