భూమా అఖిలప్రియ.. తండ్రి ఉన్నంత కాలం వీరి రాజ్యాధికారం.. కర్నూలు జిల్లాలో ఆధిపత్యం కొనసాగింది. తండ్రి తర్వాత కూడా ఆ బలమైన కుటుంబానికి రాజకీయ అండ లభించి భూమా అఖిలప్రియ మంత్రి అయ్యారు. వైసీపీ నుంచి గెలిచి టీడీపీలోకి ఫిరాయించి మరీ మంత్రి పదవి కొట్టేశారు అఖిల ప్రియ. అయితే టీడీపీ ఓడిపోయి వైసీపీ అధికారంలోకి రావడంతో కథ మారింది. కష్టాలు దాపురించాయి. వరుస కేసులు ఇప్పుడు అఖిలప్రియను వెంటాడుతున్నాయి.
వరుస వివాదాలు, కేసులతో భూమా అఖిలప్రియ వార్తల్లో నిలుస్తున్నారు.ఏపీ మంత్రిగా ఓడిపోయాక అఖిలప్రియ కష్టాలు ఎక్కువయ్యాయి. అప్పట్లో హైదరాబాద్ లో సీఎం కేసీఆర్ బంధువులంటూ ప్రచారం సాగిన కొందరిని కిడ్నాప్ చేయడం.. అందులో అఖిలప్రియపై ఆరోపణలు రావడం.. ఆమెను అరెస్ట్ చేసి జైలుకు పంపడం జరిగిపోయాయి. ఓ భూవివాదమే ఇందుకు కారణం. ఇక్కడితోనే వీరిపై కేసులు ఆగిపోలేదు. తాజాగా కర్నూలుకు కూడా ఈ కేసులు విస్తరించాయి.
ఇక కర్నూలు జిల్లాలోనూ పలు వివాదాలతో కేసుల్లో ఇరుకున్నారు. వారి కుటుంబ సభ్యులు కూడా వరుస కేసులతో వార్తల్లో నిలిచారు. భూమా అఖిలప్రియపై ఇప్పుడు కర్నూలు జిల్లాలో కేసులు వెల్లువెత్తుతున్నాయి. అనేక కిడ్నాప్, దాడుల కేసులు నమోదయ్యాయి. అఖిలప్రియతోపాటు ఆమె భర్తపై ఈ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ప్రధానంగా భూవివాదాలు, సెటిల్ మెంట్లు,రియల్ ఎస్టేట్, ఆస్తి వివాదాల్లో వీరిపై కేసులు నమోదవుతున్నాయి.
తాజాగా అఖిలప్రియపై ఆమె సోదరుడు కూడా పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనమైంది. ఆళ్లగడ్డ బీజేపీ నేత భూమా కిషోర్ రెడ్డి తాజాగా జిల్లా ఎస్పీ రఘువీరారెడ్డికి శనివారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నంద్యాలలో జరుగుతున్న ఓ వివాహానికి వస్తుండగా అఖిలప్రియ తన కాన్వాయ్ ను అడ్డుపెట్టి అనుచరులతో ఘర్షణకు దిగారని ఆరోపించారు. తన డ్రైవర్ ను కిడ్నాప్ చేసేందుకు అఖిల ప్రియ ప్రయత్నించిందన్నారు.
అఖిలప్రియ గత నెల రోజుల నుంచి ప్రజలను రెచ్చగొట్టేలా వ్యవహరిస్తోందన్నారు. ఆమెపై చర్యలు తీసుకోవాలని ఎస్పీని కోరినట్లు కిషోర్ రెడ్డి తెలిపారు.