రాష్ట్రంలో సీపీఐకి ఉన్న ప్రాముఖ్యతే వేరు. పార్టీకి ఓటు బ్యాంకు పరంగా ప్రాధాన్యం తగ్గినా.. ప్రజల పక్షాన పోరాటాలు చేయడంలో ను, ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలను తెరమీదికి తేవడంలోనూ ఈ పార్టీకి చాలా ప్రత్యేకత ఉంది. అయితే.. ఇప్పుడు ఇదే పార్టీ అంతర్మథనంలో పడిపోయింది. ``మన లైన్ ఏంటి? మనం ఏం చేస్తున్నాం`` అని మేదావి వర్గం సమాలోచనలు చేసింది. వాస్తవా నికి ప్రభుత్వ వ్యతిరేక విధానాల పునాదులపైనే కమ్యూనిస్టు పార్టీలు కాలం గడుపుతున్నాయన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ, రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత.. ఒకప్పుడు కమ్యూనిస్టులు ఏం కోరుకున్నారో.. అదే జరుగుతోంది.
అంటే.. ప్రజల కొనుగోలు శక్తి పెరగాలంటే.. వారికి నేరుగా నిధులు ఇవ్వాలనేది.. కామ్రెడ్ల ప్రధాన సిద్ధాంతం. మరీ ముఖ్యంగా కరోనా వంటివిపత్కర సమయంలో ప్రజల చేతిలో డబ్బులు ఉంటే.. కొనుగోలు శక్తి పెరుగుతుందని.. తద్వారా ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా.. ఉంటాయని చెబుతుంటారు. జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఆయన ఇదే పనిచేస్తున్నారు. కార్యక్రమం ఏదైనా.. ప్రజలకు నేరుగా డబ్బులు ముడుతున్నాయి. అయినప్పటికీ.. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాత్రం.. తీవ్రస్థాయిలో జగన్‌పై విరుచుకుపడుతున్నారు. మరోవైపు సీపీఎం మాత్రం కొన్ని విషయాలను మాత్రమే జోక్యం చేసుకుని నిశితంగా దృష్టిపెడుతుండగా.. రామకృష్ణ మాత్రం ప్రతి విషయాన్ని విమర్శలకు అవకాశంగా తీసుకుంటున్నారనే వాదన కొన్నాళ్లుగా వినిపిస్తోంది.
అయితే.. ఇప్పుడు రామకృష్ణ వ్యవహారంపై సొంత కామ్రెడ్లే ఆగ్రహం వ్యక్తం చేశారని.. ``మీరు మారాలి`` అని హితవు పలికారని.. వార్తలు వస్తున్నాయి. ఆదివారం విజయవాడలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ బృందం సమావేశం జరిగింది. పార్టీ జాతీయ కార్యదర్శి వర్గ సభ్యుడు కే నారాయణ సమక్షంలో జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర పార్టీ కార్యదర్శి.. రామకృష్ణపై కొందరు సీనియర్లు విరుచుకుపడ్డారని తెలిసింది. సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయాలన్న లక్ష్యానికి భిన్నంగా ఆయన వ్యవహరిస్తున్నా రని పలువురు ఆరోపించారు. లౌకిక, ప్రజాస్వామ్య శక్తుల ఐక్యతకు ప్రాధాన్యత ఇవ్వాలన్నది పార్టీ విధానం కాగా.. కార్పొరేట్లకు వంత పాడుతూ, ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబుకు అనుకూలంగా మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చిందని వారు రామకృష్ణను నిలదీశారు.
జగన్ ప్రభుత్వం ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీల మేరకు అనేక సంక్షేమ కార్యక్రమాలను, పథకాలను అమలుచేస్తోందని, దీన్ని ప్రజలూ స్వాగతిస్తున్నారని, అటువంటి వాటిని మనం వ్యతిరేకించాల్సిన అవసరం ఏముందని సీపీఐ నాయకులు వ్యాఖ్యానించారు. అదేసమయంలో సీపీఎం అనుసరిస్తున్న వైఖరిని గమనించాలని.. రామకృష్ణకు హితవు కూడా పలికారు. అంతేకాదు.. లోపాలు ఎత్తిచూపడం వేరు, జగన్‌ను వ్యక్తిగతంగా విమర్శించడం వేరని పార్టీ సీనియర్ ఒకరు అన్నారట. ఆయనకు మరికొందరు అండగా నిలుస్తూ.. కీలకమైన ప్రజా వ్యతిరేక విషయాలపై ఎండగట్టాల్సిందేనని. కానీ, ప్రతి విషయానికీ కాదని.. చెపప్పుకొచ్చారని సమాచారం.
అంతేకాదు.. టీడీపీ నేతలను వైసీపీ సర్కారు అరెస్టు చేసిన సమయంలో గుడ్డిగా ప్రబుత్వాన్ని విమర్శించడం కూడా సరికాదని.. నిజంగా అన్యాయం జరిగితే.. తప్పులేదని కొందరు అభిప్రాయపడ్డారు. ఇక, సీఎం జగన్ కమ్యూనిస్టుల ప్రత్యర్థి కాదని, ఆయన సంక్షేమ పథకాలను స్వాగతిస్తూనే ఏమైనా లోపాలుంటే విమర్శిద్దామని.. జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకత చూపొద్దని రామకృష్ణకు హితవు చెప్పారు. ఈ వ్యవహారంలో సీపీఎం వ్యవహరిస్తున్న తీరును పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. ‘ఇప్పటికిప్పుడు ఎన్నికలేవీ లేవు. టీడీపీ, వైసీపీలతో సమదూరంగా ఉంటూనే పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసుకుందాం. సొంత కాళ్లపై నిలబడేందుకు ప్రయత్నిద్దాం. లౌకిక, ప్రజాస్వామ్య శక్తుల ఐక్యతకు కృషి చేద్దాం`` అని నేతలు తీర్మానించారు. మొత్తంగా చూస్తే.. సీపీఐలో చంద్రబాబు విషయం.. రామకృష్ణ మద్దతిస్తున్న తీరు తీవ్ర కల్లోలాన్ని సృష్టించిందనే అంటున్నారు పరిశీలకులు.