తెలుగోళ్లు కండోమ్‌లు కొనటం తగ్గించేశారు!

Update: 2015-06-23 09:55 GMT
మరో కొత్త పరిణామం. కొన్నేళ్లుగా మొదలైన ఈ వ్యవహారం ఇప్పుడు ఆందోళనకర స్థాయికి చేరుకుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మూడేళ్ల క్రితంతో పోలిస్తే కండోమ్‌లను ఉపయోగించే వారి సంఖ్య రోజురోజుకీ తగ్గిపోతుందని తేలింది. మూడేళ్ల క్రితం అమ్మకాలతో పోలిస్తే.. ప్రస్తుతం 50 శాతం మేర తగ్గిపోయినట్లుగా చెబుతున్నారు.

రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు.. జాతీయ స్థాయిలోని చాలాచోట్ల ఇదే పరిస్థితి నెలకొందని చెబుతున్నారు. గర్భనిరోధకానికి వీలుగా మహిళలు వినియోగించే పలు పిల్స్‌ అందుబాటులోకి రావటంతో పాటు.. కండోమ్‌లను తయారు చేసే కంపెనీలు తమ ఉత్పత్తిని తగ్గించేయటం కారణంగా చెబుతున్నారు. ప్రభుత్వం ఆ మధ్య తీసుకొచ్చిన నిబంధన కూడా కండోమ్‌ వినియోగం తగ్గటానికి కారణంగా చెబుతున్నారు.

కండోమ్‌ ప్యాకెట్‌ను గరిష్ఠంగా రూ.8.35 మించి అమ్మకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవటంతో.. అప్పటివరకూ ఇదే పాకెట్‌ను రూ.30 వరకు అమ్మిన కంపెనీలు.. కండోమ్‌ అమ్మకం ధరపై ప్రభుత్వం నియంత్రణ విధించటంతో ఉత్పత్తిపై అనాసక్తి ప్రదర్శిస్తోందన్న వాదన ఉంది. దీనికి తోడు.. లాభాలు తగ్గుముఖం పట్టటంతో వాణిజ్య ప్రకటనల మీద దృష్టి సారించటం లేదని చెబుతున్నారు.

కండోమ్‌ల వినియోగం తగ్గటం వల్ల సుఖవ్యాధుల వ్యాప్తి పెరిగే ప్రమాదం ఉందని చెబుతున్నారు. హెచ్‌ఐవీ.. ఎయిడ్స్‌ లాంటి ప్రమాదకర వ్యాధులకు అవకాశం ఉందన్న వాదన వినిపిస్తోంది. మామూలుగా అయితే.. ఏడాదికి ఏడాది అమ్మకాల్లో వృద్ధి ఉండాల్సింది పోయి.. అమ్మకాలు భారీగా తగ్గటమే కాదు..కండోమ్‌ల వాడకం దాదాపు 75 శాతం మేర తగ్గిందన్న వాదనలపై ఆందోళన వ్యక్తమవుతోంది.

Tags:    

Similar News