మనం ఎన్ననుకున్నా అధికారం దగ్గరకు వచ్చేసరికి అన్న దమ్ములే కొట్టుకుంటుంటే రెండు గ్రూపుల మధ్య వ్యవహారం సజావుగా ఎలా సాగుతుంది ? సాగుతుందని ఎవరైనా అనుకుంటే అది ఉత్త భ్రమ మాత్రమే. పదవుల పంపకాల్లో అందరికీ కాస్త అటు ఇటుగా అయినా ప్రాధాన్యత దక్కిందని అనుకుంటే ఓకే. లేకపోతే వెంటనే తుపాకులు తీయటం కాల్పులు మొదలు పెట్టేయటమే. ఇపుడు ఆఫ్ఘనిస్థాన్లో జరిగింది ఇదే. దేశాధికారాన్ని చేజిక్కించుకున్న తాలిబన్లు+హక్కాని నెటవర్క్ మధ్య పదవుల పంపకంలో వివాదాలు మొదలయ్యాయని సమాచారం.
పదవుల పంపిణీలో ఏకాభిప్రాయానికి లేకపోవటంతో వెంటనే రెండు గ్రూపులు నాలుగు రోజుల క్రితం కొట్టేసుకున్నాయట. దేశధ్యక్ష భవనంలో తాలిబన్ చీఫ్ బారాదరి+తాలిబన్ నేతలతో హక్కాని నెటవర్క్ కీలక నేతలు భేటీ అయ్యారు. భేటీ ఎందుకంటే అధికారంలో ఎవరికి ఏ పదవులు కావాలనే విషయాన్ని నిర్ణయించటానికి. రెండు గ్రూపులు కలిసి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయబోతున్నపుడు కీలకమైన మంత్రిపదవుల్లో ఏది ఏ గ్రూపు తీసుకోవాలనే విషయమై చర్చలు జరిగాయి.
తాలిబన్ అగ్రనేత, కాబోయే అధ్యక్షుడు బారాదరి ఓ లిస్ట్ తీసి మంత్రి పదవుల్లో ఏ గ్రూపుకు ఏ పదవి అని చదివారట. అయితే బారాదరి చదివిన జాబితాతో హక్కాని నెట్ వర్క్ కీలక నేతలు విభేదించారట. ఎందుకంటే కీలకమైన ఆర్ధికం, విదేశీవ్యవహారాలు, రక్షణ లాంటి శాఖలన్నీ తాలిబన్ల దగ్గరే ఉంటాయని బారాదరి చెప్పారట. దాంతో హక్కాని నేతలు అడ్డుచెప్పారు. విదేశీ వ్యవహారాలు, రక్షణ శాఖలు తమకు కావాలని పట్టుబట్టారట. ఈ నేపథ్యంలోనే రెండు గ్రుపుల్లోని నేతలకు మాట మాట పెరిగి పెద్ద గొడవైంది. దాంతో రెచ్చిపోయిన హక్కానీ నెట్ వర్క్ నేతలు తాలిబన్లను తోసేసి బారాదరిని కుర్చీలో నుండి లాగి కింద పడేశారట.
తోపులాటల్లో భాగంగా కిందపడిపోయిన బారాదరి వెన్నెముక దెబ్బతిన్నట్లు సమాచారం. ఈ దెబ్బకు రెచ్చిపోయిన తాలిబన్లు వెంటనే అధ్యక్ష భవనంలో నుంచి బయటకు వచ్చేసి రోడ్లపైన కనిపించిన జనాలపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 18 మంది చనిపోగా వందలాది మంది తీవ్రంగా గాయపడ్డారు. హక్కాని మీద కోపాన్ని తాలిబన్లు మామూలు జనాల మీద ఎందుకు చూపించారంటే తాలిబన్ల కన్నా హక్కానీ నెట్ వర్క్ చాలా పవర్ ఫుల్ కాబట్టే. హక్కానీ ఎందుకంత పవర్ ఫుల్లయిందంటే దాని వెనుకున్నది పాకిస్ధాన్ ఐఎస్ఐ కాబట్టే అనేది అసలు రహస్యం. నానా అవస్థలు పడి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసినా తీవ్ర విభేదాల మధ్య ప్రభుత్వం ఎంతకాలం ఉంటుందో అనుమానమే.
ఇంతకీ అసలు విషయం ఏమిటంటే హక్కానీని ముందు పెట్టి ఆప్ఘనిస్థాన్ దేశాన్ని పాకిస్ధానే పరిపాలించాలని ప్లాన్ చేసిన విషయం మెల్లిగా బయటపడుతోంది. తాలిబన్ల సంఖ్యకన్నా, తాలిబన్ల కన్నా హక్కాని నెట్ వర్క్ చాలా పెద్దది. ఎందుకంటే హక్కానీ నెట్ వర్క్ కేంద్రస్థానం పాకిస్ధాన్లో ఉంది. దీనికి నిధులు, ఆయుధాలు, మద్దతు మొత్తం ఐఎస్ఐ అందిస్తోందట. ఆఫ్ఘన్ను అచ్చంగా తాలిబన్ల చేతికే వదిలేస్తే మళ్ళీ అమెరికాకు దగ్గరైపోతారనే భయంతోనే పాకిస్ధానే హక్కానీ నెట్ వర్క్ ను రంగంలోకి దింపిందట. కాబట్టి ఆఫ్ఘన్లో పేరుకు తాలిబన్+హక్కానీ నెట్ వర్కే అధికారంలో ఉన్న అసలు పావులు కదిపేది మాత్రం పాకిస్ధానే అనేది బయటపడుతోంది. చూద్దాం చివరకు ఏమవుతుందో.