సిద్ధరామయ్యకు చెక్.. కర్ణాటక పీసీసీ పగ్గాలు ట్రబుల్ షూటర్ కే

Update: 2020-03-12 06:53 GMT
కొన్నాళ్లుగా దక్షిణాది ప్రాంతంలోని కీలక రాష్ట్రంగా ఉన్న కర్ణాటక రాజకీయాల్లో రోజుకో పరిణామం చోటుచేసుకుంటోంది. ఇప్పుడు మళ్లీ ఆపరేషన్ ఆకర్ష్ మళ్లీ తెరపైకి వస్తోంది. ఈ పరిణామం కాంగ్రెస్ కు అంతగా లేకున్నా జేడీఎస్ కు తీవ్రంగా ఉంది. అయితే గతంతలో కర్నాటకలో అధికారం కాంగ్రెస్, జేడీఎస్ పొందగా తీవ్ర సంక్షోభం ఏర్పడిన విషయం తెలిసిందే. ఆ పరిణామాల సమయంలో మాజీమంత్రి డీకే శివకుమార్‌ కీలక పాత్ర పోషించారు. అధికారం కోల్పోకుండా ట్రబుల్ షూటర్ గా పేరుపొందిన శివకుమార్ చర్యలు చేపట్టారు. దీంతో బీజేపీ నుంచి కర్నాటకను కాపాడాడు. అయితే ఆ తర్వాత పరిణామాలు మారిపోయాయి. మళ్లీ బీజేపీ ఎత్తులకు పైఎత్తులు వేసి ఎలాగోలా కర్నాటకలో గద్దెనెక్కింది. అయితే సంక్షోభ సమయంలో కాంగ్రెస్ కు గుర్తొచ్చే వ్యక్తి డీకే శివకుమార్. అలాంటి వ్యక్తిని పార్టీ అధిష్టానం గుర్తించింది. పార్టీలో కీలక నాయకుడిగా ఉన్న వ్యక్తిని పార్టీ అధిష్టానం గుర్తించి కర్నాటక అధ్యక్షుడిగా డీకే శివకుమార్ ను నియమించింది. ఈ మేరకు బుధవారం పార్టీ అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది.


ఇటీవల అసెంబ్లీ ఉప ఎన్నికలు, లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ పరాజయం పొందడంతో కేపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న దినేశ్ గుండురావు రాజీనామా చేశారు. అప్పటినుంచి ఖాళీగా ఉన్న ఆ పదవిని తాజాగా శివకుమార్ కు కట్టబెట్టారు. అయితే డీకే శివకుమార్‌ ను కేపీసీసీ అధ్యక్షుడిగా చేయకూడదని మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విశ్వ ప్రయత్నాలు చేశారంట. ఆయన ప్రయత్నాలు చివరకు ఫలించకపోవడంతో ఎదురుదెబ్బ తగిలింది. ఆయనకు ప్రస్తుత పరిణామంలో ఎలాంటి పోస్టు ఇవ్వలేదు. సిద్ధరామయ్య సీఎల్పీ నేతగా సర్దుకుపోవాల్సిన పరిస్థితి. కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్న ఈశ్వర్‌ ఖండ్రేను కొనసాగించగా, మరో ఇద్దరికి కొత్త కార్యనిర్వహాక అధ్యక్షులుగా పార్టీ నియమించింది. దీంతో పార్టీ అధిష్టానం సీఎల్పీ నేతగా ఉన్న సిద్ధరామయ్యకు చెక్ పెట్టినట్లు తెలుస్తోంది. డీకే శివకుమార్ కు పార్టీ పగ్గాలు ఇవ్వడంతో వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలుపు సాధిస్తుందని కాంగ్రెస్ శ్రేణులు భావిస్తున్నాయి.


Tags:    

Similar News