రెండు రోజులు క్రితం తెలంగాణ అసెంబ్లీలో చోటు చేసుకున్న సంగతులన్నీ తెలిసిందే. ఈ రోజు అంతకు మించి అన్న రీతిలో గుజరాత్ లో పరిణామాలు చోటు చేసుకున్నాయి. ప్రధాని మోడీ ఇలాకా అయిన ఆయన స్వరాష్ట్రం గుజరాత్ అసెంబ్లీలో అధికార బీజేపీ.. విపక్ష కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నిండు అసెంబ్లీలో తన్నేసుకోవటం సంచలనంగా మారింది.
మొదట తిట్టుకోవటంతో మొదలైన రచ్చ చివరకు ఎమ్మెల్యేలు ఒకరినొకరు కొట్టుకోవటం వరకే వెళ్లింది. నువ్వెంత అంటే నువ్వెంత అంటూ తిట్టుకోవటం.. ఆ తర్వాత దూషించుకున్న ఎమ్మెల్యేలు..అందరూ చూస్తుండగానే ఒకరిపై ఒకరు దాడి చేసుకునేందుకు సైతం వెనుకాడలేదు. దీంతో.. సభా గౌరవం మంటగలిసిపోయిన పరిస్థితి.
కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రతాప్ కు బీజేపీ ఎమ్మెల్యే జగదీశ్ కు మధ్య ఈ రోజు అసెంబ్లీలో గొడవ మొదలైంది. రాయలేనంత దారుణమైన తిట్లను వారు ఇరువురు సభలో తిట్టేసుకున్నారు. అనంతరం వారిద్దరు ఒకరపై ఒకరు పిడిగుద్దులు గుద్దేసుకున్నారు. వారిని వారించేందుకు ఇరు వర్గాల వారు ప్రయత్నించినా ఆగలేదు సరికదా.. ఈ గొడవ మరింత ముదిరి అధికార.. విపక్ష నేతల మధ్య రచ్చ మరింత పెరిగింది. సభా గౌరవాన్ని మంటగలిపారన్న ఆరోపణపై విపక్ష సభ్యుల్ని స్పీకర్ సభ నుంచి సస్పెన్షన్ వేటు వేశారు.