మాజీ ఎంపీ.. అదిలాబాద్ లోక్ సభ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రమేశ్ రాథోడ్ తాజాగా రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. సోమవారం రాత్రి వేళ ఆయన ప్రయాణిస్తున్న ఇన్నోవా కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. రోడ్డుకు అడ్డంగా వచ్చిన పందిని తప్పించబోయిన క్రమంలో కారు ప్రమాదానికి గురైందని.. ఈ ప్రమాదంలో రమేశ్ రాథోడ్ తీవ్రంగా గాయపడినట్లుగా తెలుస్తోంది.
ప్రమాదం జరిగిన వెంటనే రమేశ్ రాథోడ్ అనుచర వర్గం ఆయన్నుహుటాహుటిన అదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో ఆయన తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. 2009లో టీడీపీ తరఫున పోటీ చేసి ఎంపీగా గెలిచిన రమేశ్ రాథోడ్.. రాష్ట్ర విభజన తర్వాత 2015లో ఆయన టీఆర్ఎస్ పార్టీలో చేరారు.
2018లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఖానాపూర్ అసెంబ్లీ స్థానం నుంచి టికెట్ ఆశించారు. అయినా ఆయనకు టికెట్ దక్కలేదు. దీంతో ఆయన టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీకి మారారు. తాజాగా జరుగుతున్న లోక్ సభ ఎన్నికల్లో ఆయనకు అదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా టికెట్ లభించింది.
సోమవారం (ఏప్రిల్ 9) రాత్రి ఎన్నికల ప్రచారం ముగించుకొని ఇంటికి వెళుతున్న సమయంలో ఆయన ప్రమాదానికి గురయ్యారు. అదిలాబాద్ లోని మావల గ్రామం వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో ఆయన తలకు గాయం తగిలినట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.