'కాపు' కాస్తామంటున్న కాంగ్రెస్

Update: 2018-08-01 07:50 GMT
రాష్ట్ర విభజనతో అధికారాన్ని కేడర్‌ ను కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ పునర్వైభవానికి సకల యత్నాలు చేస్తోంది. బద్ద శత్రువైన తెలుగుదేశంతో జత కట్టేందుకు ముందుకు వస్తోంది. ఇప్పటికే పార్టీకి దూరమైన సీనియర్లను ఆకట్టుకునే పనిలో పడింది. ఇందులో భాగంగా మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కాంగ్రెస్ కండువా కప్పి స్వాగతించింది. మిగిలిన నాయకులకు స్వాగత ద్వారాలు తెరిచింది. ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రేమను పొందేందుకు అన్నీ ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా తాము అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా ఇస్తామని ప్రధానిగా రాహుల్ గాంధీ చేసే తొలి సంతకం అదే అని చెప్తోంది. పార్లీలో ప్రత ఒక్కరిని ఇల్లిల్లు తిరిగి ప్రచారం చేయాలని ఆదేశించింది. ఇలా పార్టీని ఒకవైపు పటిష్టం చేస్తూనే మరో వైపు వివిధ కులాలు - సంఘాల వారిని ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ లో కలకలం రేపుతున్న కాపు రిజర్వేషన్లపై గళం విప్పింది.
 
తాము అధికారంలోకి వస్తే కాపులకు రిజర్వేషన్లను కచ్చితంగా అమలు చేస్తామంటూ ఆ పార్టీ రాష్ట్ర పరిశీలకుడు ఉమేన్ ఛాంద్ ప్రకటించారు. తమకు రిజర్వేషన్లు కల్పించాలంటూ గత కొంత కాలంగా కాపులు ఉద్యమిస్తున్నారు.

తాము అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు ఇస్తామంటూ ప్రకటించింది. కేంద్రంలో కూడా తమదే అధికారమని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్లపై ఓ స్పష్టతనిచ్చింది. అయితే ఆంధ్రప్రదేశ్‌ లోని బిసీలు కాంగ్రెస్ చేసిన ప్రకటనను ఎలా చూస్తారో వేచి చూడాలి. కష్టకాలంలో ఉన్నప్పుడు ప్రతి అంశాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. కాపు రిజర్వేషన్ల అంశం పరంగా చూస్తే కాంగ్రెస్ ప్రకటన వారికి మేలు చేసేల కనబడుటలేదు. కాపుల పట్ల ఆంధ్రప్రదేశ్‌ లో వ్యతిరేకత ఉందని - వారంతా కాంగ్రెస్ ను వ్యతిరేకిస్తారని పరిశీలకులు అంటున్నారు.

Tags:    

Similar News