పాదయాత్ర .. ప్రస్తుత రాజకీయాల్లో ఈ మాట ఓ హాట్ టాపిక్. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో పాదయాత్ర కి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అసలు ఆ పాదయాత్ర కి అంత క్రేజ్ ఎందుకు వచ్చిందో కూడా తెలుసు. పాదయాత్రల ద్వారా ప్రజాక్షేత్రం లోకి వెళ్లడం , ప్రజలతో మమేకం అవ్వడం , ఆ తర్వాత జరిగే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకురావడం. ప్రస్తుతం ఇదే ఓ వ్యూహాత్మకమైన ప్లాన్. పాదయాత్రలు చేసిన నేతలు అధికారంలోకి రావడం అనేది జరుగుతూ వస్తుండటం తో అందరూ నేతలు పాదయాత్రలపై ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు.
ఇక తెలంగాణ లో పాదయాత్రల కార్యక్రమం జెట్ స్పీడ్ గా ముందుకు సాగుతుంది. ఇప్పటికే బీజేపీ పాదయాత్రను షురూ చేసి అందరికంటే ముందున్నాం అంటూ చాటి చెప్తుంది. ఇక షర్మిల పార్టీ, ప్రస్తుతం పాదయాత్ర కి రంగం సిద్ధం చేసుకుంటుంది అయితే అందరికంటే ముందే పాదయాత్ర చేస్తాం అని ప్రకటించిన కాంగ్రెస్ పాదయాత్ర పరిస్థితి ఏంటి, ఎప్పుడు ప్రారంభం కాబోతున్నాయి అంటే ఇప్పటికి కూడా సమాధానం లేదు. అధికారం రావాలి అంటే పాదయాత్ర చేయాలి అనేంతగా మారింది. ప్రజలతో డైరెక్ట్ గా కలవడానికి , పార్టీ పై నమ్మకం పెంచడానికి పాదయాత్రకి మించిన మరో మంచి మార్గం లేదు. రెండో సారి తెలంగాణలో ఏర్పడ్డ టీఆర్ ఎస్ ప్రభుత్వంను గద్దె దించేందుకు కాంగ్రెస్ నేతలు పాదయాత్ర చేస్తామనే ప్రకటిస్తే, బీజేపీ నేతలు పాదయాత్ర ప్రారంభించి కాంగ్రెస్ కంటే ఓ అడుగు ముందే ఉన్నారు. బీఏస్పీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా పాదయాత్ర కు సిద్ధం అవుతున్నారు.
అయితే, కాంగ్రెస్ నేతలు మాత్రం అందరికంటే ముందే పాదయాత్ర చేస్తామని ప్రకటించినా దాన్ని ఆచరణ, కార్యాచరణ ఎక్కడ కనిపించడం లేదు. పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ అయ్యాక పాదయాత్ర చేస్తానని కీలక ప్రకటన చేశారు. అయితే ఎప్పుడు చేస్తాననేది మాత్రం చెప్పలేదు. అంతర్గత కుమ్ములాటలు, ఇతర నాయకుల సహకారం లేకపోవడం వల్ల ప్రస్తుతానికి పాదయాత్ర కి బ్రేక్ పడిందని చెప్తున్నారు. మరోనేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా భువనగిరి నుంచి పాదయాత్ర చేస్తా అన్నారు. ఆ నేత పాదయాత్ర కూడా కేవలం మాటలకే పరిమితం అయింది. ఇక మరో కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి కూడా పాదయాత్ర చేస్తా అని ప్రకటించారు.
ఈ ముగ్గురు కాంగ్రెస్ నేతల ప్రకటనలు కేవలం మాటలకే పరిమితం అయ్యాయి, అంతే ఆ మాటలు ఇప్పట్లో ఆచరణలోకి వచ్చేలా కూడా కనబడుట లేదు. అయితే , కాంగ్రెస్ నేతలు మాత్రం పాదయాత్రలపై ఇప్పటికే అధిష్టానం కి సమాచారం అందించాం అని , హైకమాండ్ పర్మిషన్ కోసం చూస్తున్నామని, ఆ అనుమతి రాగానే మొదలుపెడతాం అని చెప్తున్నారు. ఓ వైపు బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రతో దూసుకుపోతుంటే, ముచ్చటగా ముగ్గురు నేతలు పాదయాత్ర చేస్తామని ప్రకటించిన కాంగ్రెస్ నేతలు మాత్రం, దళిత, గిరిజన సభ పేరుతో సభలు నిర్వహిస్తున్నారు. ఆ సభలు నిర్వహించడంలో కూడా కన్ఫ్యూజన్ కనిపిస్తుంది. 17 సభలు నిర్వహించాలనుకున్నా, నేతల మధ్య అనైక్యతతో 4 సభలకు పరిమితం అయింది. కాబట్టి ఇకనైనా కాంగ్రెస్ నేతలు నిద్రమత్తు వీడి , ప్రజల్లోకి వస్తే కానీ కాంగ్రెస్ కి మళ్లీ పూర్వవైభవం రాదని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇలాగే కొనసాగితే మరోసారి కాంగ్రెస్ కి ఘోర పరాభవం తప్పదని అంటున్నారు.