రైతుల‌ను కాల్చినందుకు వెంక‌య్య హ‌ర్ట‌య్యారు

Update: 2017-06-08 16:17 GMT
బీజేపీ పాలిత రాష్ట్రమైన‌ మధ్యప్రదేశ్‌ లో రైతులపై కాల్పులు జరగడంపై కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు హర్టయ్యారు. అన్న‌దాత‌ల‌పై కాల్ప‌లు బాధాకరమని తెలిపిన వెంక‌య్య రైతుల మృతిని కాంగ్రెస్ రాజకీయం చేస్తుందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వమని కాంగ్రెస్ ప్రచారం చేస్తోంద‌ని మండిప‌డ్డారు. రైతులతో పోటోలు దిగడానికే కాంగ్రెస్ ఉపాధ్య‌క్షుడు రాహుల్‌ గాంధీ మధ్యప్రదేశ్‌ లో పర్యటిస్తున్నారని వెంక‌య్య‌నాయుడు ఆరోపించారు.

గతంలో ఎన్నడూ లేని విధంగా దేశంలోని రైతులకు రూ.10లక్షల కోట్ల రుణాలిచ్చామ‌ని వెంక‌య్య నాయుడు తెలిపారు.  సాగునీటి ప్రాజెక్టుల కోసం రూ.50వేల కోట్లు మంజూరు చేశామ‌ని -తక్కువ ప్రీమియంతో ఎక్కువ బీమా వచ్చేలా పథకం తీసుకువచ్చామని వివరించారు. కాల్పుల ఘటనకు సంబంధించి ఎస్పీ - కలెక్టర్‌ ను బదిలీ చేశారని, రైతులపై కాల్పుల ఘటనపై న్యాయవిచారణ జరుగుతోంద‌ని వెల్ల‌డించారు.

ఇదిలాఉండ‌గా... మ‌ధ్య‌ప్ర‌దేశ్‌ లోని మంద‌సౌర్ జిల్లాలోకి ప్ర‌వేశించేందుకు ప్ర‌య‌త్నించిన కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజ‌స్థాన్‌ లోని చిత్తోర్‌ ఘ‌డ్ జిల్లా నుంచి ఆయన మ‌ధ్య‌ప్ర‌దేశ్‌ లోకి వెళ్లేందుకు ప్ర‌య‌త్నించారు. మంద‌సౌర్‌లో రైతులు ఆందోళ‌న‌లు నిర్వ‌హిస్తున్న విష‌యం తెలిసిందే. పోలీసుల కాల్పుల్లో మృతిచెందిన రైతుల కుటుంబాల‌ను ఆయ‌న క‌లుసుకునేందుకు వెళ్లారు. ఢిల్లీ నుంచి చార్ట‌ర్డ్ ఫ్ల‌యిట్‌లో ఉద‌య్‌పూర్‌కు చేరుకున్న రాహుల్ అక్క‌డ నుంచి మంద‌సౌర్‌కు బైక్‌ పై వెళ్లారు. దాదాపు ఏడు కిలోమీట‌ర్ల రాహుల్ బైక్ మీదే ప్ర‌యాణించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News