అక్రమ సంబంధం ఫలితాలు ఎలా ఉంటాయో ఇటీవలు పలు ఉదంతాలు తెరమీదకు వస్తున్నాయి. తమ శారీరక సంబంధానికి అడ్డు వస్తున్నారని ఇటీవలి కాలంలో భార్యలు - తమ భర్తలను హత్య చేయించిన సంగతి తెలిసిందే. స్వాతి రెడ్డి - జ్యోతి ఘటనలు మరువక ముందే.. తాజాగా మరో ఘటన వెలుగు చూసింది. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని తన భర్తను ఓ భార్య ప్రియుడితో కలిసి హత్య చేయించింది. ఈ ఘటన తిరుమలగిరి మండలం నాగార్జునపేట తండాలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించిన కాంగ్రెస్ నాయకుడి హత్య ఉదంతానికి ఈ సంబంధమే కారణమని తేలింది.
మిర్యాలగూడ డీఎస్పీ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. నాగార్జునపేట తండా ఉపసర్పంచ్ దేపావత్ ధర్మానాయక్(45) రెండో భార్య శిరీషకు అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయంలో ధర్మానాయక్ పలుసార్లు శిరీషను మందలించాడు. మొత్తానికి ధర్మానాయక్ ను వదిలించుకోవాలని.. ప్రియుడితో కలిసి తన భర్తను హత్య చేయాలని శిరీష నిర్ణయించుకుంది. ధర్మనాయక్ రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో మంచం కింద బాంబు పెట్టి దారుణంగా హత్య చేయించింది. దీంతో ఆయన శరీర భాగాలు చిందరవందరగా పడి అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటనతో గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేశారు.
కొద్దివారాల క్రితమే మాజీ మంత్రి - కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అనుచరుడు బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య నల్గొండను కుదిపేసిన సంగతి తెలిసిందే. ఈ హత్య గురించి అధికార - ప్రతిపక్షాల మధ్య తీవ్రవాగ్యుద్ధం జరుగుతోంది. నల్గొండలో కాంగ్రెస్ నేత బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్యపై ఓ వైపు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుండగానే… ఆ జిల్లాలో మరో కాంగ్రెస్ నేత దారుణ హత్యకు గురయ్యారు. ఈ హత్య రాజకీయంగా తీవ్ర కలకలం రేపుతోంది. మృతుడి తల్లి ద్వాలి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సాగర్ సీఐ రవీందర్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయగా ప్రాథమిక దర్యాప్తులో అక్రమ సంబంధం కారణమని తేలింది.