మీడియాకు మించిన పోయిన సోషల్ మీడియా.. వాట్సాప్ కారణంగా.. ఇప్పుడు పరిణామాలు చాలా వేగంగా మారిపోతున్నాయి. తాజాగా హైదరాబాద్ లో సీనియర్ నేత శైలజానాథ్ కుమారుడి వివాహం జరిగింది. దీనికి రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన వివిధ పార్టీలకు చెందిన నేతలు హాజరయ్యారు. అంతేకాదు.. వివిధ వర్గాలకు చెందిన వారు వెళ్లి.. నూతన దంపతుల్ని ఆశీర్వదించారు. ఈ పెళ్లి వేడుకకు టీడీపీ అధినేత చంద్రబాబు తో పాటు పలువురునేతలు హాజరయ్యారు. టీ కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు.
ఇదంతా బాగానే ఉన్నా.. ఈ పెళ్లి సందర్భంగా తీసిన ఒక ఫోటో..రానున్నరోజుల్లో రాజకీయ రచ్చకు తెర తీయటమే కాదు.. తెలంగాణ కాంగ్రెస్ కు లేనిపోని తలనొప్పులు తెచ్చే అవకాశం ఉందంటున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు పక్కనే తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కీలక పదవిలో ఉన్న మధు యాష్కీ పక్కనే కూర్చున్నారు. వారిద్దరూ దగ్గరగా కూర్చొని మాట్లాడుకోవటం చాలామందిని ఆకర్షించింది.
గత ఎన్నికల్లో టీడీపీ.. కాంగ్రెస్ లు కలిసి పోటీ చేయటం..ఈ కాంబినేషన్ తెలుగు ప్రజలకు ఏ మాత్రం నచ్చకపోవటమే కాదు.. అప్పటి నుంచి తెలంగాణ కాంగ్రెస్ కు బాబు ప్రస్తావన తీసుకొచ్చి ఇరుకున పడేయటం గులాబీ నేతలకు ఒక అలవాటుగా మారింది. ఈ మధ్యన టీ పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డిని ఎంపిక చేసిన వైనాన్ని టీఆర్ఎస్ నేతలు వదలకపోవటం తెలిసిందే. చంద్రబాబుతో రికమండేషన్ చేయించుకోవటం ద్వారా రేవంత్ కు టీపీసీసీ చీఫ్ పదవి దక్కిందన్న ఆరోపణ వినిపించటం తెలిసిందే.
ఇదంతా ఒక ఎత్తు అయితే 2018లో జరిగిన తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ దారుణ ఓటమికి కారణం.. చంద్రబాబుతో కలిసి పోటీ చేయటం.. చంద్రబాబును తమతో పాటు ప్రచారానికి తీసుకెళ్లటంగా చెప్పొచ్చు. చంద్రబాబు ఎంట్రీతో.. తెలంగాణ పాలన అమరావతి నుంచి జరుగుతుందని.. బాబు రిమోట్ పాలన చేస్తారన్న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాటలు బాగా పని చేయటమే కాదు.. ఫలితాల మీదా తీవ్ర ప్రభావాన్ని చూపించాయన్నది తెలిసిందే. అప్పటి నుంచి చంద్రబాబుకు.. టీడీపీకి తెలంగాణ కాంగ్రెస్ నేతలు జాగ్రత్తగా ఉండటం మొదలైంది. తాజా పెళ్లి సందర్భంగా తీసిన ఫోటోతోనూ అంతో ఇంతో విమర్శలు ఖాయమన్న మాట వినిపిస్తోంది. మరేం జరుగుతుందో చూడాలి.