ప్రముకుడి కొడుకు రోడ్డు ప్రమాదంలో మృతి

Update: 2015-11-25 07:29 GMT
ఉమ్మడి రాష్ట్రంలో డీజీపీగా వ్యవహరించి.. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక సలహాదరుగా ఉన్న పేర్వారం రాములు మనమలు ఇద్దరు రింగురోడ్డు మీద జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. ఈ యాక్సిడెంట్ పలువురిని విస్తుపోయేలా చేస్తుంటే.. తాజాగా మరో ప్రముఖుడి కుమారుడు రోడ్డు ప్రమాదంలో మరణించాడు.

వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాయిని రాజేంద్రరెడ్డి కుమారుడు విశాల్ రెడ్డి తాజాగా జరిగిన రోడ్డు యాక్సిడెంట్ లో మరణించారు. వరంగల్ ఆర్టీసీ క్రాస్ రోడ్ వద్ద మోటారుబైక్ మీద వెళుతున్న విశాల్ రెడ్డిని ఆర్టీసీ బస్సు ఒకటి బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో విశాల్ రెడ్డి అక్కడికక్కడే మరణించారు.

వరంగల్ లో ఇంజనీరింగ్ చదువుతున్న విశాల్ రెడ్డి రోడ్డు ప్రమాదంలో మరణించటం పట్ల తీవ్ర విషాదం నెలకొంది. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నారు. కొడుకు మరణవార్త విని రాజేంద్రరెడ్డి కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.
Tags:    

Similar News