చైనా-భారత్ ఇష్యూ: సమాధానం చెప్పాలని మోడీకి శశిథరూర్ ప్రశ్న

Update: 2020-07-09 16:30 GMT
భారత్-చైనా మధ్య ఇటీవల ఉద్రిక్తత అంశం అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధానికి తెరలేపింది. ఈ ఘటన మొదటి నుండి కాంగ్రెస్ పార్టీ కార్నర్ అవుతోంది. అమెరికా, ఫ్రాన్స్, జపాన్ సహా వివిధ దేశాలు భారత్‌కు అండగా నిలిచాయి. గతంలో ఇంత మద్దతు ఎప్పుడూ లభించలేదని, ఇప్పుడు మోడీ కారణంగా భారత్‌కు అగ్రరాజ్యాలు మద్దతిచ్చాయని, దీంతో చైనా ఒకడుగు వెనక్కి వేసిందని చెబుతున్నారు. అయితే మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్ నేత శశిథరూర్ చేసిన ఓ ట్వీట్ హఠాత్తుగా బీజేపీని ఇరకాటంలో పడేసింది.

లడఖ్‌లో భారత్-చైనా సైన్యం ఉపసంహరించుకునేందుకు అంగీకరించాయి. దీనిపై శశిథరూర్ 2013లో మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిన ట్వీట్‌ను తిరగదోడారు. అప్పుడు మోడీ ట్వీట్ చేస్తూ.. భారత భూభాగం నుండి చైనా తన సైన్యాన్ని ఉపసంహరించుకున్నదని, కానీ మన భూభాగం నుండి మనమే ఎందుకు వెనక్కి వెళ్లాలని ఏడేళ్ల క్రితం ట్వీట్ చేశారు.

ఇప్పుడు శశిథరూర్ దానిని తవ్వారు. తనదైన శైలిలో చురకలు అంటిస్తూ ఈ ట్వీట్ చేశారు. నేను మోడీకి మద్దతుగానే ఉంటానని, కానీ నాడు ఆయన చేసిన ట్వీట్‌కు సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. తద్వారా ఇప్పుడు చైనా దళాలు ఉపసంహరించుకోవడం ఓకే, కానీ మన దళాలు మన భూభాగం నుండి ఎందుకు ఉపసంహరించుకోవాలని పరోక్షంగా ప్రశ్నించారు. అయితే అప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉందని, ఇప్పుడు బీజేపీ ఉందని, ఇందులో ఏది కరెక్టో చెప్పాలని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.




Tags:    

Similar News