సోషల్ మీడియా పుణ్యమా అని ఏదో ఒక వివాదం ప్రతిరోజూ తెర మీదకు వస్తోంది. సోషల్ మీడియా విస్తృతితో రాజకీయ నేతలకు వరంగానూ.. శాపంగానూ మారింది. ఇమేజ్ పెంచుకోవటానికి.. అదే సమయంలో పేరు ప్రఖ్యాతులు మొత్తాన్ని నాశనం చేయటానికి సోషల్ మీడియా కీలకంగా మారింది. ఎలా జరిగిందో..? ఏం జరిగిందో కానీ.. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీనికి ఉద్దేశించి సొంత పార్టీ నేతలు చేసిన వ్యాఖ్య ఒకటి ఇప్పుడు పార్టీలో హాట్ టాపిక్ గా మారింది.
రాహుల్ ను.. ఆయన రాజకీయ ప్రత్యర్థులు వ్యంగ్యంగా పప్పు అనటం తెలిసిందే. రాహుల్ ను చిన్నబుచ్చేందుకు వీలుగా ఈ వ్యాఖ్యను తరచూ చేస్తుంటారు. అయితే.. ఇదే మాట సొంత పార్టీ నేతల నుంచి వస్తుందని ఎవరూ ఊహించలేరు కూడా. కానీ.. తాజాగా అలాంటి సన్నివేశమే చోటు చేసుకొని అందరిని విస్మయానికి గురి చేస్తోంది.
ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కు వాట్సప్ గ్రూప్ ఒకటి ఉంది. ఇందులో రాహుల్ గాంధీని ఉద్దేశించి ఒక పోస్ట్ ఉంది. యూపీలోని మీరట్ జిల్లా అధ్యక్షుని పేరుతో వెలువడిన ఒక పోస్ట్ లో రాహుల్ గాంధీని పప్పుగా సంబోధించిన వైనం సంచలనంగా మారింది.
దీంతో.. సొంత పార్టీ నేతలే పార్టీ యువరాజును అంత మాట అంటారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే.. ఈ పోస్ట్ ను తాను పోస్ట్ చేయలేదని వినయ్ ప్రధాన్ వాపోతున్నాడు. తాను చేయని పనికి తనను బాధ్యుడ్ని చేస్తున్నారని.. వాట్సప్ లో రాహుల్ ను పప్పుగా పేర్కొంటూ పెట్టిన పోస్ట్ తనది కాదని.. బిజ్ నౌర్ కు చెందిన అనురాగ్ దిగా ఆయన చెబుతున్నారు. ఏమైనా.. పార్టీకి చెందిన వాట్సప్ గ్రూపులో.. పార్టీ యువరాజుగా అభివర్ణించే రాహుల్‌ను పప్పుగా సంబోధించటం జీర్ణించుకోలేని అంశంగా చెప్పక తప్పదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/