ఈ మధ్య కాలంలో కొంతమంది రాజకీయ నాయకులు కీచకావతారమెత్తుతున్నారు. బాధ్యతగా వ్యవహరించవలసిన ప్రజా ప్రతినిధులు బరి తెగిస్తున్నారు. కామంతో కళ్లు మూసుకుపోయి మహిళా అధికారులు - తోటి ప్రజాప్రతినిధుల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నారు. తాము ప్రభాప్రతినిధులం కనుక ఏమి చేసినా చెల్లుతుందనే ధీమాతో ఇష్టా రీతిగా వ్యవహరిస్తున్నారు. తెలంగాణలో కలెక్టర్ ప్రీతిమీనా చేయిపట్టుకున్న ఎమ్మెల్యే శంకర్ నాయక్ తరహా ఘటన కర్ణాటకలో జరిగింది. కర్ణాటకకు చెందిన ఓ కాంగ్రెస్ నాయకుడు బహిరంగ సభలోనే తోటి మహిళ నాయకురాలి చేయి పట్టుకున్నారు. ఆ నాయకుడి నిర్వాకం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఓ బహిరంగ సభలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
కర్ణాటకలోని మదికేరిలో స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఓ బహిరంగ సభ జరిగింది. మదికేరి కాంగ్రెస్ అధ్యక్షుడు - ప్రస్తుత సిల్క్ బోర్డ్ చైర్మన్ టీవీ రమేష్ - మహిళా ఎమ్మెల్సీ వీణా అచ్చయ్య - ఇతర నాయకులు వేదికపై కూర్చుని ఉన్నారు. హఠాత్తుగా వీణ చేతిని రమేష్ పట్టుకున్నారు. ఈ పరిణామానికి షాక్ కు గురైన వీణ వెంటనే అతడి చేతిని తోసేశారు. అయినా అంతటితో ఆగని ఆ ప్రబుద్ధుడు నవ్వుతూ మరోసారి ఆమె చేతిని చేతిని పట్టుకోవడానికి ప్రయ్నతించగా ఆమె మళ్లీ చేతిని తోసేశారు. ఈ ఘటన అంతా కెమెరాలో రికార్డు అయింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రమేష్ తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించి రమేష్ పై వీణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
అయితే, ఈ ఘటనపై టీవీ రమేష్ వివరణ వాస్తవానికి భిన్నంగా ఉంది. ‘వీణా నేను ఒకే ప్రాంతానికి చెందిన వాళ్లం. అంతేకాక ఆమె నాకు సోదరితో సమానం. మేమిద్దరం ఆరోగ్య సంబంధమైన విషయాల గురించి మాత్రమే చర్చించుకున్నాం. అంతేకాని నేను ఆమెను వేరే దృష్టితో చేయి పట్టుకోలేదు. నా ప్రతిష్టను దెబ్బతియడానికి ఈ వీడియోను షేర్ చేశారు.’ అని రమేష్ వివరణ ఇచ్చారు. సీసీ టీవీ పుటేజ్ పరిశీలించిన అనంతరం ఈ ఘటనపై ఒక నిర్ణయం తీసుకుంటామని కాంగ్రెస్ తెలిపింది. రమేష్ ఉద్దేశపూర్వకంగానే అలా చేసినట్లు తేలితే ఆయనపై చర్యలు తీసుకుంటామని పార్టీ ప్రతినిధి మీడియాకు తెలిపారు.
Full View