చాలా రోజుల తరువాత కాంగ్రెస్ పార్టీ లీడర్ తులసి రెడ్డి సీన్ లోకి వచ్చి మాట్లాడుతున్నారు.ఆయనెందుకు మాట్లాడుతున్నారు అన్నది అటుంచితే ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల్లో కాంగ్రెస్ కు రోజుల్లేవు అన్న సంగతి మరిచి మరీ మాట్లాడుతున్నారు.
జనసేనాని పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేసి మరీ మాట్లాడుతున్నారు. వాస్తవానికి కడపతో సహా పలు ప్రాంతాలలో జగన్ సేనకు ఉన్నంత పట్టు కానీ ఛరిష్మా కానీ పవన్ కు లేవు. ఒప్పుకోవాలి అలా అని యుద్ధం చేయడం అయితే జనసేన మానుకోదు అని మాత్రంసంబంధిత వర్గాలు పదే పదే సోషల్ మీడియా ద్వారా చెబుతున్నాయి.
ఈ పునరుద్ఘాటన ధోరణి ని గుర్తించకుండా తులసి రెడ్డి నోటికి వచ్చిన విధంగా మాట్లాడడం తగదని కూడా జనసేన రివర్స్ పంచ్ ఇస్తుంది.గత ఎన్నికల్లో జనసేనకు మంచి మార్కులే పడ్డాయి కానీ ఒంటరి పోరు కారణంగా ఆ పార్టీ శక్తి చాల్లేదని తేలిపోయింది. దీనిని గుర్తించి మాట్లాడాలి కానీ నోటికి వచ్చిందంతా వాగడం సబబు కాదని జనసేన హితవు చెబుతోంది.అదేవిధంగా తమ నేతపై అనుచిత వ్యాఖ్యలు చేసే తులసిరెడ్డి దమ్ముంటే పులివెందుల కేంద్రంగా జగన్ పై తిరుగుబాటు చేయాలని అంటోంది.
ఇక ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటిదాకా కాంగ్రెస్ కు, పవన్ కు మధ్య వైరం ఉంటూనే ఉంది. పవన్ కాంగ్రెస్సేతర పార్టీలను ప్రేమిస్తారు కానీ కాంగ్రెస్ ను మాత్రం ఒప్పుకోరు.వీహెచ్ లాంటి వృద్ధ నేతలను అయితే ఆ రోజు యువరాజ్యం అధినేత హోదాలో తీవ్రంగా తిట్టిపోశారు.అవధి దాటిన ఆవేశంతో ఉద్రిక్తతలకు తావిచ్చే వ్యాఖ్యలుచేశారు.
కాంగ్రెస్ నాయకులను పంచెలూడదీసి కొడతాం అని కూడా అన్నారు.అటుపై ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ లో విలీనం అయిన తరువాత చాలా కాలం అంతర్మథనంలో ఉండిపోయి, రాజకీయాలకు దూరంగా ఉన్నారు.ఇదే సమయంలో ఆయనను కొన్ని సినిమాలు నిరాశ పరిచాయి కొన్ని సానుకూల ఫలితాలు ఇచ్చారు.
సినిమా నుంచి రాజకీయం వైపు మళ్లీ వచ్చాక జనసేన ఆవిర్భావం సులువు కాలేదు కానీ ఆయన ఆశలకు అనుగుణంగానే ఆవిర్భాం అయితే అయింది.ఇప్పుడు జనసేన మరియు జగన్ సేన ఒకదానితో ఒకటి తలపడడం మంచి పరిణామమే! గెలుపు ఎలా ఉన్నా కూడా వైసీపీ ఇప్పటి నుంచే అప్రమత్తమై రాజకీయం చేస్తూ కాంగ్రెస్ లో ఉన్న పాత మిత్రుల సాయంతో పవన్ ను తిట్టిస్తోందని ఇదెక్కడి రాజకీయం అని జనసేన తీవ్రంగానే ప్రతిఘటిస్తోంది.
నేరుగా ఢీకొంటే శక్తి వంచన లేకుండా శత్రువును ఎదుర్కొనేందుకు కృషి చేస్తామని కానీ ఇటువంటి వెన్నుపోటు దారులు వెతుక్కోవద్దని కూడా వైసీపీని ఉద్దేశించి పవన్ శ్రేణులు హితవు చెబుతున్నాయి. మరి!తులసి రెడ్డి కానీ శైలజా నాథ్ కానీ వీళ్లంతో జగన్ బీ టీం గా ఉంటూ పవన్ ను ఎంత కాలం తిట్టిపోస్తారు? ఆవిధంగా వీళ్లేం సాధిస్తారు అని ప్రశ్నిస్తోంది పవన్ పార్టీ.
ఇందుకు సంబంధించి తమకొక క్లారిఫికేషన్ ఉందని, ఆ విధంగా తాము కాంగ్రెస్ నే కాదు ఇతర పార్టీల నాయకులనూ ప్రతిఘటించేందుకు సిద్ధంగానే ఉన్నామని నిన్నటి వేళ వీరమహిళలు కడప జిల్లా పులివెందుల కేంద్రంగా స్పందించారు.