ర‌క్తం చిందేలా కొట్టుకున్న కాంగ్రెస్ నేత‌లు

Update: 2017-08-09 04:51 GMT
అధికారంలో ఉన్నా విప‌క్షంలో ఉన్నా గ్రూపులు క‌ట్ట‌టం కాంగ్రెస్ పార్టీకే చెల్లింది. రాజ‌కీయ పార్టీల్లో నిజ‌మైన అంత‌ర్గ‌త ప్ర‌జాస్వామ్యం ఉన్న పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్సేన‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. పార్టీ అధినాయ‌క‌త్వం ఏం అంటుంది? ఎలా రియాక్ట్ అవుతుంద‌న్న విష‌యాన్ని అస్స‌లు ప‌ట్టించుకోకుండా ఉండ‌టం ఆ పార్టీకే చెల్లుతుంది.  త‌మకు తోచిన‌ట్లుగా ప్ర‌వ‌ర్తించే కాంగ్రెస్ నేత‌లు.. త‌మ వ్య‌క్తిగ‌త ఇష్టాయిష్టాల‌కే ప్రాధాన్య‌త ఇస్తారే త‌ప్పించి పార్టీ ప్ర‌యోజ‌నాల్ని పెద్ద‌గా ప‌ట్టించుకోర‌న్న మాట ఉంది.

త‌మ వైఖ‌రి కార‌ణంగా ప్ర‌జ‌ల్లో చుల‌క‌న అవుతామ‌న్న ఆలోచ‌న పెద్ద‌గా ప‌ట్ట‌ని కాంగ్రెస్ నేత‌ల వైఖ‌రికి తాజా ఉదంతం మ‌రో ఉదాహ‌ర‌ణ‌గా మారుతుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. హైద‌రాబాద్ లోని గాంధీభ‌వ‌న్ లో ఉమ్మ‌డి న‌ల్గొండ జిల్లా కాంగ్రెస్ నేత‌లు త‌న్నుకున్న ఎపిసోడ్‌ ను మ‌ర్చిపోక‌ముందే.. భువ‌న‌గిరిలో బాహాబాహీకి దిగ‌టం గ‌మ‌నార్హం. అంతేనా.. ర‌క్తం చిందేలా కొట్టుకున్న తీరుకు అవాక్కు అవ్వాల్సిందే.

యాదాద్రి భువ‌న‌గిరి జిల్లా కేంద్రంలో రిజ‌ర్వుడ్ నియోజ‌క‌వ‌ర్గాలైన తుంగ‌తుర్తి.. న‌కిరేక‌ల్‌.. దేవ‌ర‌కొండ ప్రాంత నేత‌ల‌తో లీడ‌ర్ షిప్ డెవ‌ల‌ప్ మెంట్ స‌మావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ స‌మావేశానికి పార్టీకి చెందిన జాతీయ స్థాయి నాయ‌కుల‌తో పాటు.. రాష్ట్ర స్థాయి నాయ‌కుల‌తో పాటు.. స్థానిక నాయ‌కులు హాజ‌ర‌య్యారు. ఏఐసీసీ ఎస్సీ సెల్ జాతీయాధ్య‌క్షుడు ప్ర‌శాంత్‌.. పీసీసీ ఉపాధ్య‌క్షుడు మ‌ల్లు ర‌వితో పాటు డీసీసీ అధ్య‌క్షుడు బూడిద భిక్ష‌మ‌య్య గౌడ్ త‌దిత‌ర నేత‌లు హాజ‌ర‌య్యారు. ఈ స‌మావేశానికి ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గం నుంచి 15 మంది పార్టీ ముఖ్యుల పేర్ల‌ను ముందుగా డిసైడ్ చేసి వారిలో మీటింగ్ ఫిక్స్ చేశారు.

ఇందులో భాగంగా దేవ‌ర‌కొండ నియోజ‌క‌వ‌ర్గ స‌మీక్ష ప్రారంభం అయిన వెంట‌నే.. మాజీ జెడ్పీటీసీ గుంజ రేణుక భ‌ర్త నారాయ‌ణ లేని..  ముందు విడుద‌ల చేసిన జాబితాలో త‌న పేరు లేద‌ని.. ఎన్నిక‌ల్లో గెల‌వాల‌నుకునే వారికి త‌న అవ‌స‌రం లేదా? అన్న ప్ర‌శ్న‌ను సంధించారు. దీనికి బ‌దులుగా నియోజ‌క‌వ‌ర్గంలో త‌న‌ను లెక్క చేయ‌కుండా వ్య‌వ‌హ‌రిస్తున్న నీ పేరు అస‌లు ఎందుకు రాయాలంటూ ఇన్ ఛార్జ్ జ‌గ‌న్ లాల్ నాయ‌క్ త‌న ముందు ఉన్న పూల‌కుండీని నారాయ‌ణ వైపు విసిరారు. దీంతో.. ఆయ‌న త‌ల‌కు దెబ్బ త‌గిలి ర‌క్తం కారింది.

ఒక్క‌సారి మారిన సీన్ స‌భ‌లో గంద‌ర‌గోళానికి గురి చేయ‌ట‌మే కాదు.. ఇరువురు నేత‌లు కొట్టుకున్నారు. వారిద్ద‌రిని విడ‌దీసే ప్ర‌య‌త్నం ఎస్సీ సెల్ అధ్య‌క్షుడు ఆరేప‌ల్లి మోహ‌న్ కింద‌ప‌డి స్పృహ కోల్పోవ‌టం గ‌మ‌నార్హం. ఇదిలా ఉంటే నారాయ‌ణ స‌తీమ‌ణి రేణుక టీ క‌ప్పుతో త‌న భ‌ర్త మీద‌కు పూల‌కుండీ విసిరిన జ‌గ‌న్ లాల్ నాయ‌క్ త‌ల‌పై కొట్టారు. దీంతో.. ఆయ‌నకు ర‌క్తం కారిది. ప‌రిస్థితి హాట్ హాట్ గా మారింది. చిన్న‌పాటి స్ట్రీట్ ఫైట్ స‌న్నివేశాన్ని త‌ల‌పించింది. దెబ్బ‌లు త‌గిలి ర‌క్తం కారుతున్న‌నాయ‌కుల్ని వెంట‌నే ఆసుప‌త్రికి పంపి చికిత్స చేశారు. కొస‌మెరుపు ఏమిటంటే.. ఆసుప‌త్రికి వెళ్లి క‌ట్లు క‌ట్టించుకున్న నేత‌లు ఇద్ద‌రూ మ‌ళ్లీ స‌మావేశానికి హాజ‌రు కావ‌టం.. పార్టీ ప‌టిష్ట‌త కోసం ఇరువురు గొడ‌వ‌లు వ‌దిలిపెట్టి పార్టీ కోసం ఐక్య‌త‌తో ప‌ని చేయాలంటూ వారిద్ద‌రి చేతులు క‌లిపి అక్క‌డి నుంచి వెళ్లారు పార్టీ ముఖ్య‌నేత‌లు. ర‌క్తం కారేలా కొట్టుకున్న నేత‌లు ఐక్య‌మ‌త్యంగా ప‌ని చేయాల‌ని చేతులు క‌లిపించిన వైనం మిగిలిన వారికి అవాక్కు అయ్యేలా చేసింది.
Tags:    

Similar News